చిత్తూరు

విద్యార్థినులు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 18: విద్యార్థినులు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని తద్వారా క్రీడా స్ఫూర్తితో జీవితంలో ముందుకు సాగాలని టాస్క్ఫోర్స్ డీఐజీ కాంతారావు సూచించారు. స్విమ్స్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఎస్వీమెడికల్ కళాశాల ఆవరణలో స్పోర్ట్స్ డే సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్, టాస్క్ఫోర్స్ డీఐజీ కాంతారావులు క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, క్రీడా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంతారావు విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు నేటి ఆధునిక సమాజంలో అన్ని రంగాలలో విశేష ప్రతిభ కనబరుస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని చెప్పారు. విద్యార్థినులు తమ లక్ష్యాలను నిర్దేశించుకొని కష్టపడి విద్యను అభ్యసించి తమ కలలను సాకారం చేసుకోవాలని చ్పెరు. విద్యతోపాటుగా వివిధ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని తమ శరీర దృఢృత్వాన్ని పెంచుకోవాలన్నారు. అందువల్ల తమ వృత్తిని మరింత నిబద్దతతో నిర్వహించుకోవచ్చన్నారు. రోగులకు నాణ్యమైన వైద్యసేవలను అందిస్తు, విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టీఎస్ రవికుమార్ మాట్లాడుతూ స్విమ్స్‌లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినుల సంఖ్య ఏడాదికేడాదికి పెరుగుతోందన్నారు. విద్యతోపాటుగా క్రీడల్లోను ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని, క్రీడాస్ఫూర్తితో అన్నింటిలో ముందంజలో నిలవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఐజీ కాంతారావును ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం జరిగిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు శరత్‌కుమార్, భరత్‌కుమార్, విశ్వనాథ్, గాయత్రి, హిమబిందులకు మెడల్స్‌ను ప్రదానం చేశారు. ఈకార్యక్రమంలో స్విమ్స్ డాక్టర్లు హనుమంతరావు, అలోక్‌సచన్, శివకుమార్, కోటిరెడ్డి, యర్రమరెడ్డి, సభద్ర, మాధవి, సుధారాణి, ఆదిక్రిష్ణయ్య, వై.వెంకటరామరెడ్డి, మధుబాబు, ప్రసాద్ రెడ్డి, వి.రాజశేఖర్, సునీత, స్విమ్స్ ఉద్యోగులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్రం
* టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలి * సీపీఐ కార్యదర్శివర్గ సభ్యుడు హరినాధ రెడ్డి డిమాండ్
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 18: విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు నరేంద్ర మోదీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు హరినాథ రెడ్డి విమర్శించారు. ఆదివారం శ్రీకాళహస్తిలో ఆపార్టీ ఏరియా మహాసభల ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని, ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన మోదీ అధికారంలోకి వచ్చాక ప్యాకేజీ ప్రకటించారని అన్నారు. అయితే ప్యాకేజీకి సంబంధించిన పనులు కూడా మంజూరు చేయకుండా నిధులు విడుదల చేయకుండా అభివృద్ధికి అడ్డు పడుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్‌డిఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. ఎంపీల చేత రాజీనామా చేయించి తిరుగుబాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పోరాటం చేస్తున్నామని, టీడీపీ కూడా ప్రత్యక్ష పోరాటానికి దిగాలన్నారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే కేంద్రం యుద్ధ ప్రకటించడం ఒక్కటే మార్గమన్నారు. ఈ సమావేశంలో ఏరియా కార్యదర్శి గురవయ్య, జిల్లా నాయకులు వెంకయ్య, పెంచలయ్య, వివిధ మండలాల నాయకులు, హమాలీ వర్కర్స్ సంఘం నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు తులసీరామ్, మూర్తి, వినోద్, రవి, అయ్యప్ప, సురేష్, భానుప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.