చిత్తూరు

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు జడ్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 18: సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్జిస్ రంజన్ గొగాయ్ ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకోగానే ఆయనకు అధికారులు సాదర స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ డిప్యూటి ఈ ఓ హరీంద్రనాథ్, పేష్కార్ రమేష్, డిప్యూటీ ఈఓ బాలాజీ, ఓఎస్డీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో వేడుకగా వసంతోత్సవం
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 18: మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీకాళహస్తిలో వసంతోత్సవం వేడుకగా జరిగింది. నూతన వధూవరులైన స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పట్టణంలోని సన్నిధి వీధిలో ఉన్న వసంత మండపంలో ఏర్పాటుచేసి వసంతాలు నిర్వహించారు. పాలు, పెరుగు, గంధం, తేనె, విబూది, సుగంధ ద్రవ్యాలతో స్వామి, అమ్మవార్లకు అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. కొత్తగా పెళ్లయిన వారికి వసంతోత్సవాలు ఏ విధంగా నిర్వహిస్తారో అర్చకులు విధంగా నిర్వహించారు. అలంకారం చేసిన తరువాత దూప, దీప నైవేద్యాలను సమర్పించారు. మధ్యాహ్నం తరువాత యాగశాలలోని పవిత్రజలాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించారు. ఆ తరువాత ధ్వజ అవరోహణం చేశారు. ఈఓ భ్రమరాంబ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు హోమం ఏర్పాటుచేసి వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో పూజలు నిర్వహించారు. ధ్వజారోహణం సందర్భంగా ఈనెల 9వ తేదీన చేసిన అలంకారాలను శాస్త్రోక్తంగా తొలగించారు. దీనినే ధ్వజ అవరోహణం అంటారు. దేవరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం కేడిగం వాహనాలపై స్వామి, అమ్మవార్ల ఊరేగింపు జరిగింది.