చిత్తూరు

స్విమ్స్‌లో మంత్రి కామినేని పర్యటనలో ప్రోటోకాల్ వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 20: ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై బీజీపీ, టీడీపీల మధ్య ఇప్పటికే ఉప్పూ, నిప్పు అన్నట్లుగా మాటల యుద్ధాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం స్విమ్స్‌లో జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ వైస్ చైర్మన్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మలకు సంబంధించిన ఫ్లెక్సీలు లేకపోవడం టీడీపీ కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందుకు ప్రధాన కారణం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగావున్న మంత్రి కామినేని శ్రీనివాస్ బీజేపీకి చెందినవారు కావడంతో కావాలనే సీఎం, ఎమ్మెల్యేల ఫ్లెక్సీలు లేకుండా చేశారని స్విమ్స్ డైరెక్టర్ తీరుపై ఎమ్మెల్యేతో సహా, ఆ పార్టీ నాయకులు విరుచుకుపడ్డారు. శ్రీపద్మావతి మెడికల్ కళాశాలలో ఓవైపు మంత్రి కౌన్సిల్ సమావేశంలో ఉంటే, బయట ఎమ్మెల్యే సుగుణమ్మతోపాటుగా ఆపార్టీ నాయకులు బైఠాయించి అధికారుల తీరుపై మండిపడ్డారు. స్విమ్స్ వెలుపల బైఠాయించిన ఎమ్మెల్యేని స్విమ్స్ పిఆర్వో వెంకటరామిరెడ్డి, డాక్టర్లు లోపలికి ఆహ్వానించినా ఆమె నిరాకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారి అభ్యర్థనను త్రోసిపుచ్చారు. అయితే టీడీపీ నాయకులు మాత్రం దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమావేశం ముగించుకుని వెలుపలికి వచ్చిన మంత్రి కామినేని దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లారు. తనకీ విషయం తెలియదని, తాను చూస్తానని మంత్రి ఎమ్మెల్యేకి, టీడీపీ నాయకులకు చెప్పి వెళ్లిపోయారు. అనంతరం తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ స్విమ్స్‌కు పునాదులు వేసింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. అయితే స్విమ్స్‌లో సిములేషన్- ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు, తిరుపతి ఎమ్మెల్యేగా తన ఫ్లెక్సీలు, పేర్లుకూడా వేయకపోవడంలో వారి నిర్లక్ష్యం అర్థమవుతోందన్నారు. ఇది సరికాదని ఆమె అన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పుష్పావతి యాదవ్, గంగమ్మగుడి చైర్మన్ ఆర్సీ మునికృష్ణలు మాట్లాడుతూ బీజేపీ నాయకులు, స్విమ్స్ అధికారులు పనిగట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తిరుపతి ఎమ్మెల్యేల పేర్లు, చిత్రాలు లేకుండా కేవలం మంత్రికి సంబంధించిన ఫ్లెక్సీలే ఏర్పాటు చేశారని ఆరోపించారు. కనీసం ఎమ్మెల్యేకి సమాచారం కూడా ఇవ్వలేదని ఆగ్రహించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం జరిగితే తాము సహించేది లేదని, తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు.