చిత్తూరు

మండలంలో ఏనుగుల గుంపు హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతీపురం, ఫిబ్రవరి 23: మండల పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం నాలుగు ఏనుగులతో కూడిన గుంపు తిరుగుతూ హల్‌చల్ చేశాయి. తెల్లవారుజామున మండల పరిధిలోని సాతు, రెడ్డివారిపల్లి, కొలాల తిమ్మనపల్లి మీదుగా 121-పెద్దూరు సమీపంలో చెరువులోకి వచ్చి తిష్ట వేశాయి. సాయంత్రం వరకు చెరువులోనే ఉన్న ఏనుగులను తరిమేందుకు కుప్పం ఎఫ్‌ఆర్వో కాలప్పనాయుడు ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులు విశ్వప్రయత్నం చేశారు. అయితే సాయంత్రం కర్ణాటక పరిధిలోని నీలగిరిహళ్లి వైపునకు వెళ్లిన ఏనుగులను కర్ణాటక ఫారెస్ట్ అధికారులు, స్థానికులు టపాకాయలు పేలుస్తూ మళ్లీ ఆంధ్ర సరిహద్దులోకి తరిమారు. చివరికు ఏనుగుల గుంపు ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులోని నీలగిరిలో మకాం వేశాయి. రాత్రిపూట ఏ గ్రామంపై దాడి చేస్తాయోనని అయా గ్రామాల ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు.

ఉద్ధృతమవుతున్న విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె
* ప్రభుత్వ తీరుకు నిరశనగా కార్మికుల అర్థనగ్న ప్రదర్శన * భారీ ర్యాలీ, గాంధీ విగ్రహానికి కార్మికులు వినతిపత్రం
చిత్తూరు, ఫిబ్రవరి 23: తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మె తీవ్రం రూపం దాల్చుతోంది. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21 వ తేది నుంచి జిల్లాలోని 2 వేల మందికి పైగా ఉన్న విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు, సిబ్బంది సమ్మె బాట పట్టిన విషయం విదితమే. సమ్మె ప్రారంభించి మూడు రోజులు ముగుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన రాకపోవడంతో వేదనకు గురైన కార్మికులు తమ సమ్మెను ఉధృతం చేయాలని నిర్ణయించారు. శుక్రవరాం అర్థనగ్న ప్రదర్శన చేశారు. స్థానిక గాంధీరోడ్డులోని విద్యుత్ కార్యాలయం నుంచి జిల్లా కోర్టు, రైల్వే స్టేషన్, జ్యోతిరావ్‌పూలే సర్కిల్, ఎన్‌టిఆర్ సర్కిల్ మీదుగా గాంధీ సర్కిల్ వరకు అర్థనగ్నంగానే భారీ నిర్వహించారు. గాంధీ సర్కిల్‌లోని జాతిపిత గాంధీకి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సమస్యలను పరిష్కరించేలా చంద్రబాబు సర్కార్ మనసు మార్చాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అక్కడ నుంచి ఎంఎస్‌ఆర్ సర్కిల్, పొన్నియమ్మ గుడి వీధి, డి ఐ రోడ్డు మీదుగా అర్థనగ్న ప్రదర్శన చేస్తూనే విద్యుత్ కార్యాలయానికి చేరుకున్నారు. కాంట్రాక్టు కార్మిక సంఘాల నేతలు హేమకుమార్, మనీష్‌కుమార్, ఐరాల శ్రీనివాసులు మాట్లాడుతూ తమ కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను విద్యుత్ సంస్థలో విలీనం చేయడం, సుప్రీంకోర్టు ఆదేశాలతోసమాన పనికి సమాన వేతనం మంజూరు, అవుట్ సోర్సింగ్ వ్యవస్థ రద్దు చేయడం, తెలంగాణా రాష్ట్రం తరహాలో కాంట్రాక్టు కార్మికులకు మూడవ పార్టీతో సంబంధం లేకుండా నేరుగా వేతనాలు చెల్లించడం, సీనియారిటి ప్రాతిపదిన తమ సర్వీసులను క్రమబద్ధీకరించడంతో, విధి నిర్వహణలో ప్రమాదవశాత్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ 20 లక్షల నష్టపరిహారం చెల్లించడంతో పాటు, సంబందిత కార్మికుని కుటుంబ సభ్యుల్లో ఒకరికి సంస్థలో ఉద్యోగం ఇవ్వడం వంటి న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సహృదయంతో ఆలోచించి తమ సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో రోజుకో రీతిలో ప్రాణాలకు తెగించి ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు నరేష్, రూప్‌కుమార్, నిరంజన్, చంద్ర, సాయితో పాటు 150 మందికి పైగా విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.