చిత్తూరు

ప్రత్యేక హోదాపై మాటల్లేవ్.. మంతనాల్లేవ్.. పోరాటమే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 23: విభజన చట్టం అమలు చేయడంలో భాగంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్రంతో ఇక మాటలు, మంతనాలు వద్దని, పోరాటాలే శరణ్యమని ఆప్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాజారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నేతలు ముక్తకంఠంతో నినదించారు. స్థానిక యూత్ హాస్టల్లో ప్రత్యేక హోదాయే శరణ్యం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్ర భవిష్యత్తుపై కేంద్రం చెలగాటమాడుతోందని బావి భారత విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు గండి కొడుతోందని నిప్పులు చెరిగారు. ఆంధ్ర రాష్ట్రం నుంచే ప్రస్తుతం ఉన్నత స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా నోరు మెదపకపోవడం దారుణమన్నారు. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రాజారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి ఆధ్వర్యంలో సమైక్యాంద్ర ఉద్యమం తరహాలో ప్రత్యేకహోదా కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమాక్రసీ జిల్లా నాయకులు హరికృష్ణ, జనసేన రాష్ట్ర నాయకుడు పసుపులేటి హరిప్రసాద్, లోక్‌సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, ఆమ్ ఆద్మీపార్టీ అధికార ప్రతినిధి రంజిత్ , జీవీకె అధ్యక్షుడు వడిత్యాశంకర్ నాయక్, వైకాపా నాయకులు రాజేంద్ర, నల్లగొండ విద్యార్థి జేఏసీ నాయకులు కిరణ్‌కుమార్ రెడ్డి, ఎన్‌జిఓ నాయకులు సురేష్, ఆర్టీసి నాయకులు వినాయక రెడ్డి, నవ్యాంధ్ర జేఏసీ నాయకులు వై.బాలాజీ, పెన్షనర్స్ అసోసియేషన్‌నాయకులు సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఈసందర్బంగా సభలో 10 తీర్మానాలను చేశారు.
23 టిపిటి 18: ప్రత్యేక హోదా సాధనపై ఆప్స్ రాష్ట్ర అధ్యక్షుడు రాజా రెడ్డి ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని సంఘీభావం తెలియ జేస్తున్న వివిధ పార్టీల నేతలు

వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

చిత్తూరు, ఫిబ్రవరి 23: రాజ్యసభ సభ్యులు వైకాపా నేత విజయసాయి రెడ్డి ఉన్నతాధికారుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్తూరు వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు, నగర మేయర్ కఠారి హేమలత, ఇతర దేశం నేతలు శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేసారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విజయసాయి రెడ్డి పలు అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ సీబీఐ ప్రత్యేక కోర్టులో నిందితుడిగా ఉంటూ ఆ కేసులు అన్నీ విచారణకు వస్తున్న తరుణంలో, ఈ కేసుల నుంచి బయట పడటానికి అధికారులపై వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ అధికారుల విధి నిర్వహణకు ఆటంకం కల్గిస్తున్నారన్నారు. గతంలో కూడా వైకాపా అధినేత జగన్ అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబును కూడా బెదిరించారన్నారు. రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి గతంలో రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్‌పోర్టు అధికారులపై దౌర్జన్యం చేశారన్నారు. చంద్రగిరి ఎమ్యెల్యే గతంలో అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారన్నారు. ఇదే తరహాలో ప్రస్తుతం విజయసాయి రెడ్డి కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఇతర ఐఏఎస్ అధికారులైన రాజవౌళి, సాయిప్రసాద్ , అదపు డీజీ వెంకటేశ్వరరావులపై దురుసుగా ప్రవర్తించటంతోపాటు, వారి మనోభావాలు గాయపడే విధంగా వ్యక్తిగత అరోపణలు చేసి వారి ప్రతిష్టను దెబ్బతీసారని ఆరోపించారు. ఎంపీ విజయసాయి రెడ్డిపై కేసులు నమోదు చేయాలని స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. దీనిపై సీఐ శ్రీ్ధర్ మాట్లాడుతూ విజయసాయి రెడ్డిపై ఫిర్యాదు అందిందని, విచారణ జరుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కఠారి ప్రవీణ్, అశోక్ ఆనంద యాదవ్, సురేష్, చక్రి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.