చిత్తూరు

28నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, ఫిబ్రవరి 25: రాష్టవ్య్రాప్తంగా ఇంటర్మీడియర్ పరీక్షలు ఈనెల 28నుంచి ప్రారంభమై మార్చి 19వ తేది వరకు జరగనున్నాయి. 28న మొదటి సంవత్సరం, మార్చి 1న ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 132 పరీక్షా కేంద్రాలలో 93,982మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో 45,263మంది, ఒకేషనల్ 3,345మంది, ద్వితీయ సంవత్సరంలో 41,056మంది విద్యార్థులు, ఒకేషనల్ నుంచి 4,318మంది విద్యార్థులున్నారు. పరీక్షా కేంద్రాలలో ప్రథమ చికిత్సా కేంద్రం, మంచినీరు, విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు:- ఇంటర్మీడియట్ పరీక్షల సమయం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నాం 12గంటల వరకు జరుగుతుంది. అయితే పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదంటూ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఖచ్చితమైన ఉత్తర్వులు అందినట్లు కళాశాల నిర్వహకులు చెబుతున్నారు. పరీక్షలకు హాజరగు విద్యార్థులు నిర్ధేశించిన పరీక్షాకేంద్రాలకు ఉదయం 8గంటలకే చేరుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షల అధికారులు చెబుతున్నారు. ఉదయం 8.45గంటల తర్వాత వచ్చిన విద్యార్థులకు సెంటర్‌లోకి అనుమతి లేదని స్పష్టం చేస్తున్నారు. పరీక్షా కేంద్రంలోనికి సెల్‌ఫోన్‌లు, క్యాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా నిషేదించారు.
జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలు 13..:- చిత్తూరుజిల్లాలో ఈనెల 28నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లాలో 132కేంద్రాలు ఏర్పాటుచేశారు. అందులో 12కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు. జిల్లాలో నిమ్మనపల్లె, కలకడ, చిన్నగొట్టిగల్లు, చౌడేపల్లె, గుడుపల్లె, పాలసముద్రం, నాగలాపురం, బంగారుపాళెం, ఐరాల, బొమ్మసముద్రం, గుడుపల్లె, కార్వేటినగరం, చవటగుంట కేంద్రాలను సమస్యాత్మక సెంటర్లుగా గుర్తించారు. ఎలాంటి అవకతవకలకు జరగకుండా, సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించారు. జిల్లాలో 14సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షించనున్నాయి.
ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లు మూత:- రాష్టవ్య్రాప్తంగా ఈనెల 28నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల ప్రాంతంలో ఇంటర్నెట్, కంప్యూటర్, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ప్రభుత్వం ఖచ్చితమైన నిబంధనలు విధించారు. ఇన్విజిలేటర్లు ఏరోజుకు ఆరోజు జంబ్లింగ్ విధానం అమలుచేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాలలో నిఘా నేత్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నాయి. గ్రామీణప్రాంతాల పరీక్షా కేంద్రాలకు సకాలంలో విద్యార్థులు సెంటర్లకు చేరుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించి బస్సు సౌకర్యాలు ఏర్పాటుచేస్తున్నారు.
హాల్‌టికెట్‌లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందిపెడితే కఠినచర్యలు - ఆర్‌ఐఓ క్రిష్ణయ్య:- ఫీజులు చెల్లించలేదని, అటెండెన్స్ తక్కువ ఉందని తదితరాలపై కళాశాల యాజమాన్యం విద్యార్థులకు హాల్‌టికెట్ ఇవ్వకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆర్‌ఐఓ క్రిష్ణయ్య వెల్లడించారు. విద్యార్థులు ఎవరికైనా అలాంటి ఇబ్బందులు వస్తే 98483009000 ఫోన్‌నెంబరుకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని ఆర్‌ఐఓ స్పష్టం చేశారు. గత ఏడాదిని దృష్టిలో పెట్టుకుని అన్ని పరీక్షా కేంద్రాలలో వౌళిక సదుపాయాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇదివరకే ఆయా పరీక్షా కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించినట్లు స్పష్టం చేశారు. పరీక్షలకు హాజరుగు విద్యార్థిని, విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని ఖచ్చితమైన ఆదేశాలు జారీచేసినట్లు స్పష్టం చేశారు.