చిత్తూరు

జిల్లాలో ప్రత్యేక హోదా కోసం నింగినంటిన నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 22: రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రజల గళం గర్జించింది. జిల్లాలో విపక్షాలన్నీ ఏకమై ప్రతి నియోజక వర్గంలోని మండల కేంద్రాల్లోని జాతీయ రహదారులపై గురువారం రాస్తారోకోలు నిర్వహించి తమ నిరసనలు తెలిపారు. పలుచోట్ల మోదీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఎర్రటి ఎండలో గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతిలో తనపల్లి జాతీయ రహదారిపై ఆందోళనాకారులు రోడ్డుపై సాష్టాంగ నమస్కారాలు చేస్తూ తమ కాంక్షను వెల్లబుచ్చారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి మోసం చేశారంటూ విపక్షాలు జాతీయ రహదారిలో రాస్తారోకో నిర్వహించి మోదీ దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి దగ్ధం చేశారు. అధికార పార్టీ కూడా నిరసనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను శవయాత్ర చేస్తున్నా, దగ్ధం చేస్తున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. సీపీఎం, సీపీఐ, వైకాపా, కాంగ్రెస్, పార్టీలు ఏకమై తనపల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అయితే అధిష్ఠానం ఆదేశాల నేపథ్యంలో టీడీపీ తిరుపతి నగరంలోని నాలుగుకాళ్ల మండపం వద్ద మానవహార నిర్వహించారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు గత రెండు రోజులుగా ప్రత్యేక హోదాపై ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న నేపథ్యంలో గురువారం హోమం నిర్వహించారు. ఎస్వీయూ వైకాపా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి టైర్లను దగ్ధం చేసి నిరసన తెలిపారు. మొత్తం మీద ప్రత్యేక హోదా ఉద్యమం సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తలపించేలా ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటన వచ్చేంత వరకు ప్రతినిత్యం ప్రజాభాగస్వామ్యంతో నిరసనలు వ్యక్తం చేయడానికి విపక్షాలు సిద్ధపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే సీపీఎం జిల్లాకార్యదర్శి అంగేరి పుల్లయ్య, నాయకులు కుమార్ రెడ్డి, నాగరాజు, సీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, ఆర్.లక్ష్మి, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జయచంద్ర, సుబ్రమణ్యం, సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, నాయకులు చిన్నం పెంచలయ్య, ఎన్డీ రవి, రాధాకృష్ణ, ఏఐవైఎఫ్ నాయకులు, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి, రైతు నాయకుడు ఆదికేశవులు రెడ్డి, ఎస్సీ సెల్ నాయకుడు రాజేంద్ర, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రమీలమ్మ, నైనార్ శ్రీనివాసులు, తమటం వెంకటనరసింహులు, రుద్రరాజు శ్రీదేవి, ఐద్వా నాయకురాలు సాయిలక్ష్మి, గురువారం ఉదయం 10 గంటలకు కార్యకర్తలతో పెద్ద ఎత్తున తనపల్లి జాతీయ రహదారి వద్దకు చేరుకున్నారు. ఆయా పార్టీలు తమ పార్టీ జెండాలను చేతపట్టుకుని రోడ్డుపై బైఠాయించారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రెండు గంటలపాటు ధర్నా జరగడంతో రోడ్డుపై నిలిచిపోయిన వాహనాల్లో ఉన్న ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిని గమనించిన పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు గంటపాటు నిరసన వ్యక్తం చేసిన విపక్ష నేతలు అటు తరువాత మోదీ దిష్టిబొమ్మ శవయాత్ర చేశారు. అనంతరం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తిరిగి గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా సీపీఎం, సీపీఐ నాయకులు రోడ్లపై సాష్టాంగ నమస్కారాలు చేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా ఆందోళనలకు అనుమతి ఇవ్వడంతో బందోబస్తుకు వచ్చిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. చివరకు పోలీసుల వినతితో ఆందోళనాకారులు నిరసన విరమించుకుని వెళ్లారు. ఈ సందర్భంగా విపక్ష నేతలు మాట్లాడుతూ వెంకన్న పాదాల సాక్షిగా హామీలిచ్చి మోదీ రాష్ట్రాన్ని మోసం చేశారని, తగిన మూల్యం చెల్లించక తప్పదని నిప్పులు చెరిగారు. తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటే వారి దెబ్బ ఎలా ఉంటుందో రానున్న ఎన్నికల్లో చూస్తారన్నారు. అదే సమయంలో మోదీ ఎంత మోసం చేశారో వారితో చేతులు కలిపి బీజేపీతో హనీమూన్ చేసుకున్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను అంతమోసం చేశారన్నారు. రాష్ట్ర ప్రజల పాలిట మోదీ, బాబులు ఇద్దరూ కేడీలేనన్నారు. విపక్షాలు గళం విప్పడంతోనే చంద్రబాబు విధిలేని పరిస్థితుల్లో యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా పాట పాడుతున్నారంటూ మండిపడ్డారు. నాడు విపక్షాలు చెప్పినట్లు బాబు విని ప్రత్యేకహోదా పాచిపోయిన లడ్డూ అని, ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్రానికి సంజీవిని అని అనకపోయివుంటే ఇప్పటికే ప్రత్యేక హోదా వచ్చి ఉండేదన్నారు. మోదీ, బాబులు రాష్ట్ర ప్రజలను మోసం చేసినా విభజన చట్టంలోని హామీలను, ప్రత్యేక హోదాను సాధించేవరకు విపక్షాలు ఉమ్మడి ఉద్యమ బాటనే సాగిస్తామని హెచ్చరించారు.
మోదీ... కేడీ
* నాలుగుకాళ్ల మండపం వద్ద టీడీపీ మానవహారం
ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తానని నమ్మించి మోసం చేసిన ప్రధాని మోదీ కేడీ అంటూ టీడీపీ నాయకులు చేసిన నినాదాలతో నాలుగుకాళ్ల మండపం మారుమోగింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గురువారం ఉదయం 9నుంచి అరగంటపాటు టీడీపీ నాయకులు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ప్రత్యేకహోదాపై విపక్షాలు ఆందోళనకు దిగినా టీడీపీ నేతలు మాత్రం వేరుగా ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితి కూడా విమర్శలకు గురైంది. ఈసందర్భంగా తుడా చైర్మన్ నరసింహయాదవ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సుధారాణి, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, ఇనుకొండ సుబ్రహ్మణ్యం, నీలం బాలాజీ, డాక్టర్ సంజయ్, టీడీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పుష్పావతి యాదవ్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సూరా సుధాకర్ రెడ్డి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీ్ధర్ వర్మ, టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎన్.విజయలక్ష్మి, బుల్లెట్ రమణ, నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్ యాదవ్, జిల్లా కార్యదర్శి మనె్నం శ్రీనివాసులు, గంగమ్మగుడి చైర్మన్ ఆర్సీ మునికృష్ణ, నగర కార్యనిర్వాహక కార్యదర్శి మధుసూదన్ యాదవ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా నేతలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలుగు వారి ఆత్మగౌరవం దెబ్బతీసేలా వ్యవహరించిందని మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వానికి పట్టిన గతే ఎన్డీయే ప్రభుత్వానికి పడుతుందని వారు స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని నాలుగేళ్లు నమ్మించి మోసం చేసిన కేడీ మోదీ అని మండిపడ్డారు.