చిత్తూరు

కమనీయం.. రాములవారి కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, ఏప్రిల్ 21: చంద్రగిరిలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో జరుగుతున్న నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల వారికి అత్యంత వైభవంగా కన్నుల పండువగా గురువారం జరిగింది. చంద్రగిరిలోని అతి పురాతనమైన శ్రీ కోదండరామాలయంలో ఈనెల 15 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా 7వ రోజు ఉదయానే్న సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకాలు నిర్వహించి పట్టువస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలు వైభవంగా అలంకరించి నిత్యపూజలను నిర్వహించారు. అనంతరం భక్తులను ఆర్శనానికి అనుమతించారు. ఉయదం 11 గంటల ప్రాంతలో కల్యాణోత్సవం కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక మైన వేదిక వద్దకు సీతారామలక్ష్మణ ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి టిటిడి ఆగమ పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టం నిర్వహించారు. అంతకుముందు సీతారాముల కల్యాణం సందర్భంగా ముత్యాల తలంబ్రాలను ఊరేగింపుగా ఆలయం నుంచి వేదిక వద్దకు తీసుకొచ్చారు. దంపతుల ముత్యాలకు, తలంబ్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాల మధ్య ఈ కల్యాణ ఘట్టాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవం మధ్యలో వేద పండితులు తాళిబొట్లను, పూలదండలను , అమ్మవారికి, అయ్యవారికి సమర్పించే ముందు భక్తులకు చూపించడంతో భక్తులు శ్రీరామ నామ స్మరణలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదాలు, తాగునీరు మజ్జిగ వంటి సౌకర్యాలను టిటిడి ఏర్పాటుచేసింది. సాయంత్రం హనుమంత వాహనంపై సీతారామ లక్ష్మణ ఆంజినేయ ఉత్సవ విగ్రహాలను ఉంచి పట్టువస్త్రాలు, ఆభరణాలు, సువాసనలు వెదజల్లే పుష్పాలతో వైభవంగా అలంకరించారు. ఈ సందర్భంగా మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ వాహనం ఆలయం చుట్టూ ఊరేగింపుగా బయలుదేరింది. ఈ కల్యాణోత్సవం అనంతరం తిరుపతి జె ఇ ఓ పోలాభాస్కర్ మాట్లాడుతూ చంద్రగిరి కోదండరామాలయంలో మొట్టమొదటి సారిగా నవాహ్నిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. నూతన ధ్వజ స్థంభం ఏర్పాటుచేసినప్పటికీ ధ్వజరోహణం, ఆవరోహణం రెండూ నిర్వహించలేదని అన్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు హనుమంత వాహనం, గరుడ వాహనం ఊరేగింపు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలకు మరొక వాహనం ఊరేగింపు కూడా నిర్వహిస్తామని ,ఈ విధంగా 9 రోజుల పాటు 9 వాహనాలను నిర్వహించేందుకు ఇ ఓ తో సంప్రదిస్తామని తెలిపారు. అలాగే నెలలో ఒక రోజు ఇక్కడ కల్యాణోత్సవం నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఇక్కడ కల్యాణోత్సవం కోసం శాశ్వతమైన కల్యాణ వేదికను భక్తులు తిలకించేందుకు అవసరమైన స్థలం పర్మినెంటుగా ఉండేందుకు ఏర్పాట్లు కూడా చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇ ఓ వెంకటయ్య, ఎ ఇ ఓ ధనంజయులు, ఇన్స్‌పెక్టర్ శివ తదితరులు పాల్గొన్నారు.