చిత్తూరు

రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 25: రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ప్లీనరీ సమావేశంలో చేసిన తీర్మానాలను ఆయన వెల్లడించారు. అనంతపురం జిల్లాకు గుంతకల్ రైల్వే జోన్, సెంట్రల్ యూనివర్శిటీని, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలని తీర్మానించామని చెప్పారు. సీమలో సహజ వనరులను వినియోగంలోకి తీసుకువచ్చి తద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలని తీర్మానించామన్నారు. సీమలోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం పోరాడటం, ప్రతి ప్రాజెక్టు సాధనపై ఉద్యమాలు, సీమకు 400 టీఎంసీల సాధనకోసం పోరాడాలని నిర్ణయించామన్నారు. దళిత, గిరిజనులకు ప్రభుత్వమే భూములు కొనుగోలు చేసి అందించాలని సమావేశం తీర్మానించిందన్నారు. రాయలసీమ పట్లకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వివక్షను సహించేది లేదని, రానున్న ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. ఇంతకాలం సీమపై వహించిన నిర్లక్ష్యాన్ని ప్రజలు సహించడానికి సిద్ధంగాలేరన్నారు.

హడ్కో పురస్కారం అందుకున్న కమిషనర్ హరికిరణ్
తిరుపతి, ఏప్రిల్ 25: హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 48వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరికిరణ్‌కు ‘అత్యుత్తమ సహకారం కోసం ప్రశంసలు’ పురస్కారాన్ని కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పూరి అందించారు. తిరుపతి నగరపాలక సంస్థ ఐహెచ్‌ఎస్‌డీపీ, బీఎస్‌యుపీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా గృహాలను నిర్మించడం జరిగింది. ఈ పథకంలో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు హడ్కో రుణం కోసం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన హరికిరణ్ దరఖాస్తు చేశారు. హడ్కో విడుదల చేసిన రుణాలో బాలాజీ డెయిరీ వద్ద ఉన్న గృహ సముదాయంలో సుమారు 360గృహాలను పూర్తి చేశారు. అలాగే తనపల్లి వద్ద ఉన్న 1704గృహ సముదాయాన్ని పూర్తి చేయించి ఇళ్లు లేని నిరుపేదలకు అందజేశారు. కమిషనర్ హరికిరణ్ ఒక ప్రణాళిక ప్రకారం హడ్కో రుణాన్ని సద్వినియోగం చేసుకుని నగరపాలక సంస్థ అధికారులను సమన్వయ పరుచుకుని మొత్తం గృహ సముదాయాలను పూర్తి చేయించడం జరిగింది. రుణాన్ని సద్వినియోగం చేసుకుని గృహాలు పూర్తి చేసినందుకు గాను హరికిరణ్‌కు ఈ పురస్కారాన్ని అందించారు. ఈ పురస్కారం అందుకోవడం పట్ల తిరుపతి నగరపాలక సంస్థ, తుడా అధికారులు హరికిరణ్‌కు అభినందనలు తెలిపారు.