చిత్తూరు

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కర్కశంగా అణిచివేసింది చంద్రబాబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 25: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైకాపా, ఇతర పార్టీలు చేసిన ఉద్యమాలను కర్కశంగా అణివేసిన ఘనుడు చంద్రబాబు నాయుడని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా చేసిన ద్రోహి చంద్రబాబు అని, ఆయన ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో బుధవారం స్థానిక గాంధీ విగ్రహం వద్ద 40 డిగ్రీల సెల్సియస్ ఎండలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈసందర్భంగా వైకాపా నాయకులు రోడ్లపై కోడిగుడ్లు పగులకొట్టి ఆమ్మేట్లు వేసి ఎండ తీవ్రత ఎలా ఉందో అర్థమయ్యేలా తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి నల్ల దుస్తులు దరించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈక్రమంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో బాబు అనుసరించిన దుర్నీతి, కేంద్రం అనుసరించిన నిర్లక్ష్యాన్ని దుయ్యబడుతూ నినాదాలు చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా సంజీవిని కాదని, ఆమాట ఎవరూ పలకరాదంటూ హోదా కోసం పోరాడిన వారిని బాబు జైళ్లకు పంపాడని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్న వారిలో మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడైతే, రెండో వ్యక్తి ప్రధాని మోదీ, మిగతా భాగస్వామ్య పక్షాలని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే, ప్రజా, కార్మిక, విద్యార్థి, ఉద్యోగ వర్గాలకు, రాష్ట్భ్రావృద్ధికి జరిగే మేలును గుర్తించి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అలుపెరుగని పోరాటంతో కార్యోన్ముఖుడయ్యారన్నారు. ఈక్రమంలో ఆయనకు ప్రజల మద్దతు పెద్ద ఎత్తున లభించిందని చెప్పారు. దీంతో ప్రజల దృష్టిలో జగన్ హీరోగా మారుతున్న విషయం గుర్తించి బాబు దొంగనాటకాలకు తెరతీశారన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 20న తన జన్మదినాన్ని పురస్కరించుకుని అమరావతిలో ఉపవాస దీక్ష చేశాడని ఎద్దేవా చేశారన్నారు. ఆయన ఒక్క రోజు భోజనం చేసి ఉంటే రూ. 300 ఖర్చు అయ్యేదన్నారు. ఆయన చేపట్టిన ద్రోహ దీక్షకు రూ.30 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. తిరిగి తిరుపతిలో ఈనెల 30న లక్ష మందితో బాబు బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారని, ఆసభలో ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేయడానికి వేదికగా చేసుకుంటున్నారన్నారు. ఈసభలో మోదీపై విమర్శలు చేయడానికన్నా ముందు బాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. 2014 ఏప్రిల్ 30వ తేదీన మోదీతోపాటు తిరుపతి ఎన్నికల సభలో పాల్గొన్న చంద్రబాబు రాష్ట్రానికి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన వ్యక్తి అన్నారు. నాలుగు సంవత్సరాలపాటు విలువైన సమయాన్ని దుర్వినియోగం చేసి నేడు మొసలి కన్నీరు కారుస్తున్న బాబు తిరుపతి వేదికగా ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సి ఉందన్నారు. వైకాపా రాష్ట్రం కోసం చేస్తున్నది ఉద్యమం అవుతుందన్నారు. బాబు అమరావతిలో చేపట్టిన ఒక్క రోజు దీక్షకు రూ.30 కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా ఆరేడు వందల ఏసీలు తన చుట్టూ ఏర్పాటు చేసుకుని చల్లటి వాతావరణంలో ఉపవాస దీక్ష చేశారన్నారు. రాష్ట్ర ప్రజల మనోబావాలను పరిరక్షించడం కోసం తమ అధినేత, వైకాపా నాయకులు, కార్యకర్తలు పోరాటం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాపరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎస్కేబాబు, నాయకులు ముద్రనారాయణ, ఎస్సీ సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు తలారి రాజేంద్ర, యువజన నాయకుడు ఇమామ్, నాయకులు తాళ్లూరు ప్రసాద్, రామస్వామి వెకంటేష్, వెంకటేష్ రెడ్డి, పెరుగుబాబు యాదవ్, కట్టాగోపియాదవ్, చింతాభరణి యాదవ్, నగర మహిళ విభాగం అధ్యక్షురాలు పునీత, చెలికం కుసుమ, భారతి, శోభ తదితరులు పాల్గొన్నారు