చిత్తూరు

అభివృద్ధి పనులను త్వరితగతిన చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 22: నగర పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు సూచించారు. మంగళవారం సిబ్బందితో కలసి ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి పనులు పరిశీలించారు. నగరంలోని ఇందిరా ప్రియదర్శిని మార్కెట్, దామినేడులోని గృహ సముదాయం, తూకివాకం సివెరెజి ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను పరిశీలించారు. దామినేడులో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన పట్టణ పేదల గృహ సముదాయాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. గృహసముదాయంలో త్వరలోనే లబ్ధిదారులకు గృహాలను కేటాయించడం జరుగుతుందని, గృహ సముదాయం చుట్టూ పచ్చని చెట్లు పెంచాలని సూచించారు. తూకివాకం కంపోస్టు యార్డు వద్ద ఉన్న ఎస్‌టీపీ మిషనరీని పరిశీలించారు. అధికారులతో మాట్లాడుతూ కంపోస్ట్ యార్డ్ చుట్టూ ఫెన్సింగ్ వేయాలని ఆదేశించారు. ఫెన్సింగ్ వేసే ముందు చుట్టూ స్థలాన్ని సర్వే చేయించి నగరపాలక సంస్థ స్థలం ఎంత వరకు ఉందో మార్కింగ్ చేసి పెన్సింగ్ వేయాలని సూచించారు. తూకివాకం నుండి పద్మావతి మహిళా కళాశాల రోడ్డును పరిశీలించారు. కొన్ని చోట్ల మొక్కలు ఎండిపోయి ఉండటాన్ని గుర్తించి వాటి స్థానంలో వేరే చెట్లను పెట్టి, ప్రతిరోజు నీళ్లు పోసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరాప్రియదర్శిని మార్కెట్‌ను తనిఖీ చేసి షాపులకు కేటాయించిన స్థలం కంటే ఎక్కువ భాగం రోడ్డుపై దుకాణాలు ఉండటాన్ని గుర్తించి తొలగించారు. మరోసారి ఇలా చేస్తే లైసెన్సులు రద్దు చేస్తానని హెచ్చరించారు. కమిషనర్‌తో పాటు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

మల్లిమడుగు డ్యాం పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్
రేణిగుంట, మే 22: జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మంగళవారం మధ్యాహ్నం మల్లిమడుగు డ్యాం డ్యామ్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన కాంక్రీట్ పనులను పరిశీలించారు. మల్లిమడుగు ఇరిగేషన్ అధికారులతో డ్యాం నిర్మాణ పనుల మ్యాప్‌ను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతంగా కొనసాగాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కనక నరసారెడ్డి, తహశీల్దార్ నరసింహులు నాయుడు, మల్లిమడుగు నిర్మాణం పనుల ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.