చిత్తూరు

తిరుమల పవిత్రతను, టీటీడీ ప్రతిష్టను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 25: శ్రీవారి దర్శనార్థం సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి వచ్చే భక్తుల సేవే పరమాధిగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రమణదీక్షితులు చేసిన ఆరోపణలతో తిరుమల పవిత్రతను, టీటీడీ ప్రతిష్టను పరిరక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని టీటీడీ ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో నినదించాయి. రమణ దీక్షితుల ఆరోపణలపై ఇప్పటికే టీటీడీలోని అన్ని వర్గాల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న విషయం విధితమే. ఈక్రమంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు ఎస్‌డబ్లుఎఫ్, సీపీఎస్, బీసీ, ఎస్సీ సంఘాలు ఇతర ఉద్యోగ సంఘాలు రమణ దీక్షితుల వ్యాఖ్యలను నిరసిస్తూ టీటీడీ పరిపాలనా భవనం ముందు సుమారు గంటన్నరపాటు ఆందోళనకు దిగి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీటీడీ ఎస్‌డబ్ల్యుఎఫ్ నాయకులు నాయకులు నాగార్జున, వెంకటేష్, రత్నప్రభాకర్, జేసీఏ నుంచి వెంకటరమణా రెడ్డి, మహేంద్ర రెడ్డి, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ప్రసాదరావు, ఆంజనేయులు, ఉమెన్ అసోసియేషన్ నుంచి ఇందిర, ఫల్గుణ, ఆదిలక్ష్మి, బీసీ అసోసియేషన్ రామచంద్ర, సీపీఎస్ అసోసియేషన్ నాయకులు రవికుమార్, హరినాధ్, ముని వెంకటరెడ్డిలు మాట్లాడుతూ తిరుమలపై వెలసివున్న శ్రీ వేంకటేశ్వరస్వామిపై అపారమైన భక్తి విశ్వాసాలతో వస్తున్న అశేష భక్తజనంతో తిరుమల పవిత్రతో విరాజిల్లుతోందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ధ హైందవ ధార్మిక సంస్థగా తిరుమల ఖ్యాతి గడించడం వెనుక భక్తుల విశ్వాసం ఉందన్న విషయాన్ని ఎవరూ విస్మరించరాదన్నారు. సుమారు రెండు దశాబ్దాలకు పైగా స్వామివారికి కైంకర్యాలను ఆలయ ప్రధాన అర్చకులు స్థాయిలో పూజలు చేసిన రమణ దీక్షితులు తిరుమల పవిత్రత, ప్రతిష్టకు విఘాతం కలిగేలా ఆరోపణలు చేయడం తగనిపని అన్నారు. నిజంగా శ్రీవారి ఆలయంలో ఏవైనా సమస్యలు ఉండి ఉంటే ఆలయ ప్రధాన అర్చకుడి హోదాలో టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి కాని, పాలక మండలి దృష్టికి కాని తీసుకువెళ్లాలన్న కనీస ధర్మాన్ని దీక్షితులు పాటించకపోవడం బాధాకరమన్నారు. ఒక వేళ టీటీడీ అధికారులు, పాలకమండలి ఆయన ఫిర్యాదులకు స్పందించక పోయి ఉంటే స్వామివారి నీడన బతికుతూ ఆయన కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్న ఉద్యోగుల దృష్టికి తీసుకురావాలన్న కనీస బాధ్యతను కూడా దీక్షితులు విస్మరించడం ఎంత వరకు ధర్మమన్నారు. టీటీడీలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఒక శ్రీవారి సైనికుడనే వాస్తవాన్ని ఈ సందర్భంగా ఆయనకు గుర్తు చేస్తున్నామన్నారు. శ్రీవారి ఆలయంలో తవ్వకాలు జరిగాయని దీక్షితులు నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు. తిరుమల ఆలయం వెలుపలే కాకుండా లోపల భాగంలో కూడా భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ సీసీ కెమేరాల వ్యవస్థను ఎప్పటి నుంచో ఏర్పాటు చేసిందన్నారు. అలాంటప్పుడు సీసీ కెమేరాల్లో పడకుండా తవ్వకాలు ఎలా చేశారో దీక్షితులే చెప్పాలన్నారు. పింక్ డైమెండ్ కనిపింపించకుండా పోయిందని, దానిని విదేశాల్లో వేలం వేశారని, దాని విలువ వందల కోట్లని చెప్పారన్నారు. స్వామివారి వాహన సేవల ఊరేగింపులో భక్తులు వేసిన నాణేల దెబ్బకు స్వామివారు ధరించివున్న ఆభరణాల్లో ఒక రూబీ పగిలిపోతే రమణ దీక్షితుల పర్యవేక్షణలోనే దానిని భద్రపరచడం జరిగిందన్నారు. దీనిని ఆయన ఎందుకు బయటపెట్టలేదన్నారు. శ్రీవారి ఆభరణాలను ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు చేస్తూనే ఉన్నారని చెప్పారు. దీనిని తమ దృష్టికి తీసుకువచ్చినా తాము పోరాటం చేసేవారమన్నారు. అలాకాకుండా భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడటం సరికాదన్నారు. టీటీడీ యాజమాన్యం సైతం అనేక పొరబాట్లు చేసినట్లు విజిలెన్స్ నివేదికలు, ఆధారాలు ఉన్నాయని, వీటిని అణిచిపెట్టడం వల్లే నేడు ఇన్ని దుష్పరిణామాలు చోటుచేసుకున్నాయని వారు చెప్పారు. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఆరోపణలు చేయడం మానుకుని టీటీడీ ప్రతిష్టను దిగజార్చకుండా, ఉద్యోగుల, భక్తుల, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాలని కోరారు.