చిత్తూరు

ఎర్రచందనం స్మగ్లర్‌పై పీడీయాక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 19: ఎర్రచందనం స్మగ్లర్ సిసింద్రీపై పీడీయాక్టు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెదురుకుప్పం మండలం ముతలం గ్రామానికి చెందిన సిసింద్రీ మూడేళ్లుగా జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషిస్తూ పొరుగు రాష్ట్రాలకు ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఇతనిపై జిల్లాలో పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఇటీవల పట్టుబడిన సిసింద్రీ ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీగా ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా వల్ల కీలక పాత్ర వహిస్తున్న సిసింద్రీ(23)పై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని జిల్లాకలెక్టర్‌కు నివేదించడంతో, కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్పీ తెలిపారు.

అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న టాస్క్ఫోర్స్ సిబ్బందిపై స్మగ్లర్ల రాళ్లదాడి
* అడవిలోకి పారిపోయిన స్మగ్లర్లు * 145 దుంగలు స్వాధీనం
తిరుపతి, జూన్ 19: ఎర్రచందనం స్మగ్లర్లు మరోమారు బరితెగించారు. కూంబింగ్ చేస్తున్న టాస్క్ఫోర్స్ సిబ్బందిపై రాళ్ల వర్షం కురిపించారు. ఒక్కరు ఇద్దరు కాదు ఏకంగా 150 మంది ఎర్రస్మగ్లర్లు ఎదురు దాడికి దిగారు. అయినా మొక్కవోని ధైర్యంతో ప్రాణాలకు తెగించి స్మగ్లర్లను వెంటాడారు. తమ ఆటలు సాగకపోవడంతో స్మగ్లర్లు పలాయనం చిత్తగించారు. ఈ సందర్భంగా 145 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గమనించ దగ్గ విషయం ఏమిటంటే సాంకేతికత సహాయంతో దుంగలను తరలించడానికి సిద్ధంగా ఉన్న టిప్పర్‌ను గుర్తించి అప్రమత్తమైన టాస్క్ఫోర్స్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మంగళవారం టాస్క్ఫోర్స్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ రవిశంకర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. టాస్క్ఫోర్స్ ఆర్‌ఎస్‌ఐ విజయనరసింహులు, డీఆర్వో శ్రీనివాసులు, ఎఫ్‌ఎస్ నాగరాజు, పీసీలు ఉమశ్రీను, ప్రసాద్, నాగరాజు, బాలకృష్ణ ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత కరకంబాడి రోడ్డులోని భూపాల్ నగర్ హౌసింగ్ కాలనీలోకి ఒక టిప్పర్ లారీ వెళ్లడాన్ని గుర్తించారు. అనుమానం వచ్చిన సిబ్బంది ఆ వాహనం నెంబర్‌ను సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించగా ఆటో నెంబర్ రిజిస్టర్ అయి ఉండటాన్ని గమనించారు. అనుమానం వచ్చిన సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి అదనపు బలగాలతో కూంబింగ్ ప్రారంభించారు. భూపాల్‌నగర్ సమీపంలోకి వచ్చిన టాస్క్ఫోర్స్ సిబ్బందికి దాదాపు 150 మంది వరకు స్మగ్లర్లు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా స్మగ్లర్లు టాస్క్ఫోర్స్ సిబ్బందిపై రాళ్లు రువ్వుతూ అడవిలోకి పారిపోయారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించగా దాదాపు 145 ఎర్రచందనం దుంగలు లభించాయి. టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయాడు. ఇదే ప్రాంతంలో ఇప్పటి వరకు దాదాపు 20సార్లు ఎర్రచందనం అక్రమ రవాణా అవుతూ పట్టుబడిందని ఎస్పీ రవిశంకర్ ఈ సందర్భంగా చెప్పారు. అడవిలోని దుంగలను టాస్క్ఫోర్స్ జాగిలాల సాయంతో స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలాన్ని ఐజీ కాంతారావు పరిశీలించారన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ హరినాథబాబు రమణ, ఎసీఎఫ్ కృష్ణయ్య, ఆర్‌ఐ చంద్రశేఖర్, మురళీ, ఎఫ్‌ఆర్వో లక్ష్మీపతి, ప్రసాద్ ఉన్నారు.