చిత్తూరు

టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులకు ఉపాధికి ‘నైపుణ్యాభివృద్ధి’పై శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 19: ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన టీటీడీ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉపాధికి అవసరమయ్యే ‘నైపుణ్యాభివృద్ధి’పై శిక్షణ ఇవ్వాలని టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ అధ్యాపకులను కోరారు. తిరుపతిలోని శే్వతభవనంలో టీటీడీ విద్యాసంస్థలలోని అధ్యాపకులకు, గ్రూప్ లీడర్లకు శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి డిగ్రీ, పీజీ కళాశాల, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్‌జిఎస్ ఆర్ట్స్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. టీటీడీ విద్యాదాన ట్రస్టు, బెంగళూరుకు చెందిన శ్రీశ్రీ రూరల్ డెవలెప్‌మెంట్ ట్రస్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు గతేడాది నుంచి నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధికి అవసరమయ్యే శిక్షణ ఇవ్వడం ద్వారా సమాజంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ప్రస్తుతం దేశంలో నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఉందని, విద్యార్థులకు నైపుణ్యం లేకపోవడం వలన అవకాశాలు కోల్పోతున్నారని తెలిపారు. టీటీడీ విద్యాసంస్థలలోని విద్యార్థులు, ఇతర కళాశాలల విద్యార్థుల కంటే భిన్నంగా ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, ఆత్మ విశ్వాసం పెంచడానికి నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, తదితర అంశాలపై నిష్ణాతులైన అధ్యాపకులతో పాఠ్యాంశాలు రూపొందించి, శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. చదువుతో పాటు సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన పెంచడానికి, ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి అధ్యాపకులు, గ్రూపులీడర్లు బాధ్యతాయుతంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని జేఈఓ కోరారు. అనంతరం బెంగళూరుకు చెందిన శ్రీశ్రీ రూరల్ డెవలెప్‌మెంట్ ట్రస్ట్ డైరెక్టర్ దిగ్విజయ్ మాట్లాడుతూ 3సంవత్సరాల డిగ్రీకోర్సుతోపాటు నైపుణ్యాభివృద్ధి పాఠ్యాంశాలు రూపొందించినట్లు తెలిపారు. ఇందులో విద్యార్థులకు సమయపాలన, ఆకర్షణీయంగా మాట్లాడేవిధానం, నలుగురితో మాట్లాడటానికి, నాయకత్వ లక్షణాలు, సమాచార నైపుణ్యాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, సృజనాత్మక ఆలోచన, ప్రదర్శన నైపుణ్యం, సమర్థవంతమైన భావ వ్యక్తీకరణ, బాడీలాంగ్వేజ్, మాట్లాడే సమయంలో బిడియం పోగొట్టడం వంటి వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డీఈఓ ఎం.రామచంద్ర, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి, ఎస్‌జీఎస్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎబి శాంతి, ఎస్‌పీడబ్ల్యూ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి.మణి, ఇతర అధికారులు, అధ్యాపకులు, గ్రూప్‌లీడర్లు పాల్గొన్నారు.

జిల్లాలో పట్టుసాగుకు పూర్వవైభవం తీసుకొస్తాం
* పట్టుసాగుకు ఉపాధిహామీ పథకం అనుసంధానం * పట్టుగూళ్ల ఉత్పత్తి షెడ్ల నిర్మాణానికి 50శాతం రాయితీ
* తేనెటీగల పెంపకానికి ప్రత్యేక శిక్షణ - కలెక్టర్ ప్రద్యుమ్న వెల్లడి
మదనపల్లె, జూన్ 19: నాడు పట్టుసాగు చిత్తూరుజిల్లా మొదటిస్థానంలో నిలిచిందని, గత పదేళ్లుగా వెనుకబడిన పట్టుసాగుకు పూర్వవైభవం తీసుకువస్తామని జిల్లాకలెక్టర్ పి.ఎస్.ప్రద్యుమ్న తెలిపారు. మంగళవారం మదనపల్లె-పుంగనూరు మార్గంలోని 150మైలు వద్ద గల పట్టుగూళ్ల ఉత్పత్తి కేంద్రం, సిల్క్ రీలింగ్ శిక్షణ కేంద్రాన్ని జిల్లాకలెక్టర్ ప్రద్యుమ్న పరిశీలించారు. గతంలో మూతపడిన సిల్క్‌రీలింగ్ శిక్షణ కేంద్రాన్ని పునప్రారంభిచడం, సకాలంలో వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలో పట్టుసాగుకు పూర్వవైభవం రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శిక్షణ కేంద్రంలో అత్యాధునికి యంత్రీకరణ పరికరాలతో గూళ్ళనుంచి దారం వేరుచేయు విధానం, వాటిలో మొదటి, ద్వితీయ, తృతీయ రకాల దారాలను వేరుచేయడం, వేరుచేసిన దారాన్ని శుద్ధిచేయడం, శుద్ధిచేసిన దారాలను, బండిల్స్‌ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పట్టుపరిశ్రమ ద్వారా రైతులకు ఎక్కువ ఆదాయం వస్తుందని, రైతులు పట్టుసాగు చేయుటకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గతేడాది జిల్లాలో 38వేల ఎకరాలలో పట్టుసాగు చేశారని, ప్రస్తుత ఏడాదిలో అదనంగా 10వేల ఎకరాలో పట్టుసాగు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. చిత్తూరు, అనంతపురం జిల్లాలో పట్టుసాగుకు అనుకూలమైన వాతావరణమని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో రైతులలకు పట్టుసాగు చేసుకొనుటకు ఉపాధిహామీ పథకం ద్వారా ఎకరా పట్టుసాగుకు రూ.1.25లక్షలకు షెడ్ నిర్మాణానికి రాయితీపై రూ.1.59వేలు ఉపాధిహామీ ద్వారా రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో పట్టురీలింగ్ షెడ్ నిర్మించుకునేందుకు బ్యాంకు రుణాలు అందజేశామన్నారు. జిల్లాలోపాలు, పట్టుపరిశ్రమ, తేనే ఎక్కువగా అభివృద్ధి చేయుటకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రద్యుమ్న వెల్లడించారు. జిల్లాలో పాలు ఉత్పత్తిలో ఇప్పటికే అభివృద్ధి సాధించామని, పట్టుపరిశ్రమ, తేనె ద్వారా ఎక్కువమంది రైతులకు శిక్షణ ఇచ్చి తేనెటీగల పెంపకం, తేనెటీగల పిల్లలు, డబ్బాలు అందజేస్తామన్నారు. తేనెటీగల పెంపకం కోసం మదనపల్లె, పలమనేరు, కుప్పం ప్రాంతాలలో ఎక్కువగా అటవీప్రాంతాలు కలిగి ఉండటంతో తేనెటీగల పెంచుటకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. తేనెటీగల పెంపకం ద్వారా తక్కువఖర్చుతో ఎక్కువ ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రతిగ్రామాన్ని 11స్టార్స్ గ్రామాలుగా తయారుచేసి, ప్రతికుటుంబానికి నెలకు అదనంగా రూ.10వేలు ఆదాయం వచ్చేలా చేస్తామన్నారు. కొత్తకొత్త పథకాలను అమలుపరచి పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ, అనుబంధశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట పట్టుపరిశ్రమశాఖ జాయింట్ డైరెక్టర్ అరుణకుమారి, డిప్యూటీ డైరెక్టర్ దేవకుమార్, సహాయ సంచాలకులు ఎస్.సాహీదాబేగం, విజయరామిరెడ్డి తదితరులు ఉన్నారు.