చిత్తూరు

యోగసాధనతో మానసిక ప్రశాంతత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 21: యోగాతో మానసిక ప్రశాంతతతోపాటు చక్కటి ఆరోగ్యం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. గురువారం స్థానిక మెసానికల్ మైదానంలో ఆయాష్, నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్వక్షతన అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ , జడ్పీ చైర్‌పర్స్‌న్ గీర్వాణి చంద్రప్రకాష్‌లు జ్యోతి ప్రజ్వలన చేశారు. యోగా శిక్షకులు రాజేంద్ర యోగి యోగా ఆసనాలను చేయించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆలోచన కార్యచరణ విజ్ఞానం , అంకిత బావాల్లో మనల్ని యోగా గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతుందన్నారు. యోగాసనం, యోగాలు మన పూర్వీకులు ప్రపంచానికి ఇచ్చిన వారసత్వ సంపదన్నారు. ఆరు నెలల పాటు యోగా ఆసనాలు చేస్తే దానికి అనుగుణంగా ఫలితం దక్కుతుందన్నారు. యోగాతో దేహం, శరీరం శుద్ధి అవుతుందన్నారు. ప్రతి రోజు నిర్ణీతకాల వ్యవధిలో యోగా చేస్తే మంచిదన్నారు. ప్రస్తుతం కొన్న గ్రామాల్లో యోగా కార్యక్రమాలను చేపట్టామని, శెట్టిపల్లిలో ప్రస్తుతం యోగాను ప్రారంభించడం జరిగిందని, ఈ గ్రామంలో రోజు మహిళలు, రోజువారి కూలీలు, ఆటోడ్రైవర్లు, తదితరులు యోగాసనాలు చేస్తున్నట్లు వివరించారు. జడ్పీ చైర్ పర్స్‌న్ గీర్వాణి చంద్రప్రకాష్ మాట్లాడుతూ యోగా ద్యానం చేస్తే ప్రజలు అందరూ ఆనందంగా ఉంటారన్నారు. యోగా నిరంతర పక్రియ తెలిపారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు యోగాను ఒక పాఠ్యాంశంగా ఏర్పాటు చేస్తే విద్యార్థుల ఆరోగ్యంలో మార్పు వస్తుందన్నారు. తిరుపతికి చెందిన డాక్టర్ కోడూరు బాల సుబ్రమణ్యం మాట్లాడుతూ కలెక్టర్ యోగా గ్రామ్ అనే కార్యక్రమాన్ని చేపట్టారని, ఇందులో భాగంగా జిల్లాలో వంద గ్రామాలను దత్తత తీసుకొనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఆనంతరం యోగా గురువులను సన్మానించారు, యోగాపై నిర్వహించిన క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేసారు. ఈ కార్యక్రమంలో జేసీ 2 చంద్రవౌళి, డిఆర్వో గంగాధర్ గౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగ స్వామి, యోగా గురువులు లక్ష్మీ, ఇతర జిల్లా అధికారులు నగర ప్రముఖులు , విద్యార్థులు పాల్గొన్నారు.

22 నుంచి ఆర్టీసీ అదనపు బస్సులు
తిరుపతి, జూన్ 21: ప్రయాణీకుల సౌకర్యార్థం జిల్లాలోని వివిధ డిపోల నుంచి 106 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం టి.చెంగల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22 నుంచి 25 వరకు బెంగళూరుకు 63, చైన్నయ్‌కి 5, విజయవాడకు 3, ఇతర మార్గాల్లో 35 బస్సులను నడుపుతున్నామన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.