చిత్తూరు

భక్తులు సమర్పించిన నాణేల వేగవంత మార్పిడికి ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 21: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి భక్తులు సమర్పించిన నాణేలను వేగవంతంగా మార్పిడి చేయాలని టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని నాణేల పరకామణిని గురువారం టీటీడీ ఛైర్మన్ తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ భక్తులు శ్రీవారికి సమర్పించిన కానుకలలోని నాణేలు పేరుకుపోకుండా లెక్కింపు పూర్తి చేసి బ్యాంకులలో డిపాజిట్ చేయాలన్నారు. విదేశీ, స్వదేశీ నాణేల విభజన, లెక్కింపును త్వరితంగా పూర్తి చేయాలన్నారు. అవసరమైతే రిజర్వ్‌బ్యాంకు అధికారులతో మాట్లాడేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఆయన అధికారులతో కలిసి స్వదేశీ నాణేలు, విదేశీ నాణేల పరకామణిని, ట్రెజరీని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎఫ్‌ఎ అండ్ సీఎఓ బాలాజి, వీజీఓ సదాలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

గోవిందరాజస్వామి ఆలయంలో శోభాయమానంగా పుష్పయాగం
తిరుపతి, జూన్ 21: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మే 21 నుంచి 29వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విధితమే. ఈ ఉత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 9.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంతరం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ఎ.వి శ్రీనివాస దీక్షితులు ఆధ్వర్యంలో పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గనే్నరు, మొగిలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల సంప్రదాయ పుష్పాలు, 6రకాల పత్రాలు కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. ఈ పుష్పాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఒక టన్ను, తమిళనాడు నుంచి ఒక టన్ను, కర్ణాటక నుంచి ఒక టన్ను దాతలు విరాళంగా అందించారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ముందుగా టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ దంపతులు శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం నుంచి పుష్పాలను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చారు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి వరలక్ష్మి, ఉద్యాన విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఏఈఓ ఉదయ్ భాస్కర్ రెడ్డి, సూపరింటెండెంట్ జ్ఞానప్రకాష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు కృష్ణమూర్తి, ప్రశాంత్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.