చిత్తూరు

ఘనంగా శ్రీ పెరియాళ్వార్ శాత్తుమొర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 23: స్థానిక శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలోని శ్రీ పెరియాళ్వార్ వారి శాత్తుమొర శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 8 గంటలకు నరసింహతీర్థం నుంచి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయానికి తిరుమంజనం తీర్థం తీసుకువచ్చారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ గోవిందరాజ స్వామివారు గరుడ వాహనంపై, శ్రీ పెరియాళ్వార్ వారు గజ వాహనంపై ఆలయనాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పెరియాళ్వార్ వారి సన్నిధిలో శాత్తుమొర, అవతార పురాణ పఠనం, ఆస్థానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో శఠగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, గోవింద రామానుజ చిన్న జీయర్ స్వామి, టీటీడీ స్థానికాలయాల డిప్యూటి ఈ ఓ వరలక్ష్మి, ఏ ఈ ఓ ఉదయ్‌భాస్కర్ రెడ్డి, సూపరింటెండెంట్ జ్ఞానప్రకాష్, టెంపుల్ ఇన్స్‌పెక్టర్లు కృష్ణమూర్తి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఏపీ కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం పటిష్టతకు కృషి చేయండి
తిరుపతి, జూన్ 23: చిత్తూరు జిల్లాలో కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం పటిష్టతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ్య అన్నారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగ ఉన్న రాష్ట్ర, జిల్లాకార్యవర్గాలాను రద్దు చేశామన్నారు. మూడేళ్లు కాలం ముగిసిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అదే సమయంలో నూతనంగా తిరుపతి నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కుమ్మర గంగులప్ప, రాష్ట్ర కార్యదర్శిగా వీరవరపు సూరిబాబు, చిత్తూరుకు చెందిన కంచెర్ల దేవరాజులును రాష్ట్ర కార్యదర్శిగా నిమిమించడం జరిగిందన్నారు. ఈమేరకు వారికి నియామక ఉత్తర్వులు అందించి అభినందించారు. కుమ్మరులను ఏకం చేసి సంఘాన్ని పటిష్టం చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో నాయకులు గుండ్లూరు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ గ్రామసభల్లో భూ సమస్యలు పరిష్కారం
కేవీబీపురం, జూన్ 23: కేవీబీపురం మండలంలోని ఆరె, ఆదరం పంచాయతీల్లో శనివారం రెవెన్యూ గ్రామసభలు జరిగాయి. 2 పంచాయతీల్లో పేరుకుపోయిన భూ సమస్యలు రెవెన్యూ గ్రామసభల ద్వారా పరిష్కారమయ్యాయని తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు మునస్వామి యాదవ్ తెలిపారు. ఈ రెండు గ్రామసభల్లో తహశీల్దార్ ప్రకాష్‌బాబు , వారి టీం పాల్గొని భూ సమస్యల పరిష్కారానికి చొరవచూపారు. రెవెన్యూ గ్రామసభల ద్వారా కేవీబీపురం మండలంలోని భూ సమస్యలు కొంత మేర పరిష్కారమవుతున్నాయని, రైతులు కూడా గ్రామసభలను సద్వినియోగం చేసుకుంటున్నారని మునస్వామియాదవ్ తెలిపారు.