చిత్తూరు

ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడమాలపేట, జూన్ 23: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 7 నుంచి 7.30 గంటల మధ్య మిధునలగ్నంలో వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణం ఘట్టం జరిగింది. తొలిరోజు రాత్రి 8నుంచి 9 గంటల వరకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడవీధులో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ధ్వజారోహణ కార్యక్రమం వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ శాస్త్రోక్తంగా భక్త జనరంజకంగా సాగింది. అంతకుమునుపు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒక మారుముందుగా పర్యవేక్షించడమే ఈ తిరుచ్చి ఉత్సవం నిర్వహణ. ధ్వజస్తంభం వద్ద విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బేరితాడనం, బేరి పూజ, ధ్వజపటం, నవసంధి, శ్రీవారి మాఢవీధి ఉత్సవం, ఆస్థానం నిర్వహించారు. ఇక ధ్వజారోహణం కార్యక్రమంలో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుడ్ని నూతన వస్త్రంపై లిఖించి పూజలుచేసి ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు. ధ్వజారోహణ వీక్షణం చేసిన వారికి ఎన్నో దానాలుచేసిన ఫలితం దక్కి భక్తులు పునీతులవుతారని విశ్వాసం. ధ్వజారోహణం 18 గణాలను, ముక్కోటి దేవతలను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడమే కాకుండా సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి కూడా ధ్వజారోహణం దోహదపడుతుందన్నది భక్తుల విశ్వాసం. ఆలయ కంకణభట్టార్ సూర్యకుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ స్థానిక ఆలయాల ప్రత్యేక శ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి మునిరత్నం రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ స్వామివారి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేశామని, ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తకోటికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. 9రోజులు అన్నదానం నిర్వహిస్తామన్నారు. ఆలయంలో పుష్పాలంకరణలు, క్షేత్ర మహిమను తెలిపేలా ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటుచేశామన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. వాహనసేవల్లో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాబృందాలు ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు అమ్మవార్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు ఊంజల్‌సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉద్యానవన శాఖ ఏర్పాటుచేసిన పుష్పాలంకరణలు, విద్యుత్ శాఖ ఏర్పాటుచేసిన దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో మధుకైటభలనే రాక్షసులను సంహరించి వేదాలను బ్రహ్మదేవునికి హయగ్రీవ రూపంలో సమర్పిస్తున్న శ్రీ మహావిష్ణువు సెట్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ధ్వజారోహణ పెద్ద శేష వాహనంలో టీటీడీ డీ ఈ చంద్రశేఖర్, ఎఈఓ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ గోపాలకృష్ణ, ఏవీఎస్‌ఓ పార్థసారధి రెడ్డి, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాసులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్సులో
ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
తిరుపతి, జూన్ 23: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ ఎక్స్, వై కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సెట్విన్ సీఈఓ ఎస్.లక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 3 నుంచి 24వ తేదీలోపు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎయిర్‌మెన్‌సెలక్షన్స్.సీడీఏసీ. ఇన్, అలాగే కేరీర్‌ఇండియన్‌ఎయిర్‌ఫోర్స్.సీడీఏసీ.ఇన్ వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. ఇంటర్, డిప్లమో చదివి ఇంగ్లీష్‌లో 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, 1998 జూలై 14 నుంచి 2002 ఫిబ్రవరి 26వ తేదీలోపు జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని చిత్తూరు జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.