చిత్తూరు

స్వాతంత్య్ర దినోత్సవం రోజున అన్ని మండలాల్లో ఆస్తులు పంపిణీ జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఆగస్టు 13: జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అన్ని మండలాల్లో ఆస్తుల పంపిణీ జరగాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం చిత్తూరులోని జిల్లా సచివాలయంలో కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయిలో ప్రతి ఎంపిడివో కార్యాలయంలో జరిగే స్వాతంత్య్ర దినోత్స వేడుకలు సందర్భంగా ఈ ఆస్తుల పంపిణీ జరగడానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే జిల్లాలోని అనేక శాఖలు నిధులు కేటాయించడంతోపాటు అనుమతులు కూడా ఇచ్చామన్నారు. దీన్ని దృష్టిలో ఉంచు కొని అన్ని శాఖలు కేటాయింపులను దృష్టిలో ఉంచుకొని ఆస్తులను పంపిణీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆవార్డులతో పాటు తులసి మొక్కను అందించాలి, ఇందుకు అవసరమైన ఏర్పాట్లును అటవీశాఖ అధికారులు పూర్తి చేయాలన్నారు. గ్రామ దర్శిని కార్యక్రమంలో భాగంగా ప్రతి శనివారం అధికారులు గ్రామాల్లో పర్యటించి అక్కడ సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ చూపాలన్నారు. అలాగే ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు తేనిటీగలు పెంపకం పట్ల ఆసక్తి పెంచుకొనే విధంగా వారిని చైతన్య పరిచి వారికి బ్యాంకులు ద్వారా రుణాల అందేలా కృషి చేయాలన్నారు. జిల్లాలోని అన్ని వసతి గృహల్లో రిపేర్లను అక్టోబర్ రెండో తేదినాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.బాల సంజీవిని పథకం ద్వారా పిల్లలకు పోషక ఆహారం సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జేసి 2 చంద్రవౌళి, ఇతర జిల్లా శాఖ అధికారులు పాల్గొన్నారు.

పరిశ్రమల స్థాపనకు ముందుకు రండి
* జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న పిలుపు
నగరి, ఆగస్టు 13: పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న పిలుపునిచ్చారు. సోమవారం విజయపురం మండలంలోని కోసల నగరంలో గల ఎం.జికోరాప్యాక్ భవనంలో జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న అంబత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ మానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వారితో సమావేశం నిర్వహించారు. విజయపురం మండలంలోని కోసల నగరంలో ఏపీఐఐసీ స్వాధీనంలో ఉన్న భూమిని అభివృద్ధి పరచి కేటాయించాలని, అలాగే నీటి సదుపాయం తదితర వౌలిక సదుపాయాలు కల్పించాలని అంబత్తూరుకు చెందిన పారిశ్రామిక వేత్తలు జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అన్ని వౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. రాబోయే సమావేశంలో ఇతరత్రా విషయాల గురించి చర్చించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల జాయింట్ డైరెక్టర్ అనిల్‌కుమార్ రెడ్డి, తిరుపతి ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఐఎల్‌ఎం రామ్, తహశీల్దార్ తుకారాం, ఎంపీడీఓ బాలగణేష్, అంబత్తూరుకు చెందిన పారిశ్రామిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు.