చిత్తూరు

స్వచ్ఛ భారత్ - స్వచ్ఛ రైల్వేలో తిరుపతి రైల్వే స్టేషన్‌కు మూడో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 13: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్ 3వ స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా రూ. 50 కోట్లు వార్షిక ఆదాయం ఉన్న రైల్వేస్టేషన్లకు జాతీయ స్థాయిలో స్వచ్ఛ రైల్వే పోటీలను నిర్వహించారు. ఇందులో 75 రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఏడాది పోటీ నిర్వహించగా, ఇందులో దక్షిణ మధ్య రైల్వేకు రెండోస్థానం లంభించింది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే స్టేషన్ల పరిధిలో తిరుపతి, వరంగల్ స్టేషన్లు మూడో స్థానంలో నిలిచాయి. గతేడాది తిరుపతి రైల్వే స్టేషన్ 19వ స్థానంలో నిలిచిన విషయం విదితమే. విజయవాడకు 4, విశాఖకు 10వ ర్యాంకు లభించాయి. ఏ1, ఏ క్యాటగిరి పరిధిలో విజయవాడ, సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లు టాప్ 15లో ఏ1 క్యాటగిరిలో నిలిచాయి. స్టేషన్ డైరెక్టర్‌గా కె.సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తిరుపతి రైల్వే స్టేషన్ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. స్టేషన్ మేనేజర్ ఎం.సుభోద్ మిత్ర, పారిశుద్ధ్య విభాగాధిపతి హేమరాజ్ మీనన్ రైల్వే స్టేషన్‌లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. దీంతో తిరుపతి మూడో స్థానాన్ని దక్కించుకుంది. డిఆర్‌ఎం విజయ్‌ప్రతాప్ సింగ్ పారిశుద్ధ్యానికి రూ. 50వేలు రివార్డు ప్రకటించారు. పారిశుద్ధ్యంలో ప్రత్యేకంగా కృషి చేసిన విభాగాధిపతి మీన్‌ను, సిబ్బందిని స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, మేనేజర్ సుబోధ్ మిత్రలు అభినందించారు.
తిరుపతి నగరానికి కేంద్ర స్థాయిలో మరో అవార్డు
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈజీ ఆఫ్ లివింగ్ 2018 పోటీల్లో తిరుపతి నగరం మరో జాతీయ స్థాయి అవార్డును కైవసం చేసుకుంది. తిరుపతి నగరానికి 4వ స్థానం రాగా, రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం దక్కింది. తిరుపతి పట్టణం ఇప్పటికే అనేక అవార్డులను సొంత చేసుకున్న విషయం పాఠకులకు విదితమే. తిరుపతి ప్రజల నివాసయోగ్యం కోసం కేంద్రం 15 అంశాలను నిర్దేశించింది. ఇందులో విద్య, వైద్యం, సామాజిక భద్రత, కరెంటు, రవాణా, తాగునీరు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ తదితర అంశాల్లో తిరుపతి నగరం ముందుండటంతో ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న కమిషనర్ విజయరామరాజును, సిబ్బందిని, ప్రజలను అభినందించారు.

తిరుమలకు ఆర్టీసీ బస్సులు కుదింపు
తిరుపతి, ఆగస్టు 13: తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం సందర్భంగా తిరుపతి, తిరుమల మధ్య నడుపుతున్న ఆర్టీసీ బస్సుల సంఖ్యను కుదిస్తున్నట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎం.్భస్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి-తిరుమల మధ్య 411 బస్సులు 1669 ట్రిప్పులు తిరుగుతుండగా భక్తుల రద్దీ లేనికారణంగా 232 బస్సులనే 833 ట్రిప్పులు నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఒక్క తిరుమలకే కాకుండా శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుచానూరులకు చెన్నయ్, వేలూరు, కంచి, బెంగళూరు రాష్ట్రాల నుంచి నడిచే ఆర్టీసీ బస్సులను సైతం 40 శాతం వరకు తగ్గించామన్నారు.