చిత్తూరు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఆగస్టు 14: జిల్లా కేంద్రంలోని పోలీసు శిక్షణా మైదానంలో బుధవారం జరగనున్న 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర్ బాబు ఈ ఏర్పాట్లును స్వయంగా మంగళవారం పర్యవేక్షించారు. ఈ వేడుకలు జరిగే పోలీసు శిక్షణా మైదానం వద్ద ముందస్తు చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ మైదానాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. బుధవారం రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. ఈ వేడుకలను తిలకించడానికి వచ్చే ప్రజలకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక సదుపాయం కల్పించారు. బుధవారం ఈ మార్గంలో ఇతర వాహనాలు రాకుండా ట్రాఫిక్‌ను మల్లించనున్నారు. వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ముందుగా మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తదుపరి పోలీసు వందనం స్వీకరించి ఆ తర్వాత జిల్లా ప్రజల నుద్ధేశించి ప్రసంగిస్తారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ సేవలకు పురష్కారాలు, శకటాల ప్రదర్శన, వివిధ శాఖల ద్వారా లబ్ధిదారులకు ఆస్తులను పంపిణీ చేస్తారు. ఇవి అన్ని ముగిసిన తర్వాత జాతీయ గీతాలాపనతో ఈ వేడుకలు ముగియనున్నాయి, జిల్లా కేంద్రంలోని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఏర్పాట్లుపై కలెక్టర్ ప్రద్యుమ్న విలేఖరులతో మాట్లాడుతూ చిత్తూరు పోలీసు శిక్షణా మైదానంలో జరిగే 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వివిధ పథకాల కింద లబ్ధిదారులకు వెయ్యి కోట్ల ఆస్తులను పంపిణీ చేస్తున్నామని, ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు పంపిణీ చేయడం ఒక రికార్డుని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఒకేసారి ఇంత పెద్దఎత్తున ఆస్తులను పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన 900 మందికి మంత్రి ద్వారా పురష్కారాలలతోపాటు ప్రత్యేకంగా ఉసిరి, తులసి మొక్కలను అందిస్తామన్నారు. పోలీసు, ఫైర్ , డిఆర్‌డిఏ, డ్వామా, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్, హౌసింగ్, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఐసిడిఎస్, అటవీశాఖ, హార్టికల్చర్, పర్యాటక శాఖ, వ్యవసాయ, దేవాదాయ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన కొనసాగుతుందన్నారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల సాంస్కృతి ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు వివరించారు. మంచి వాతావరణంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని జిల్లా వాసులంతా తరలి వచ్చి ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.