చిత్తూరు

టెంపోను ఢీకొన్న బస్సు భక్తులకు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 17: తిరుమల అవుట్‌రింగ్‌రోడ్డులో టెంపోను బస్సు ఢీకొనడంతో పలువురు భక్తులకు గాయాలపాలైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అమలాపురంకు చెందిన కొంతమంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరు ఓ టెంపో వాహనంలో వెళుతుండగా అవుటర్‌రింగ్‌రోడ్డు వద్ద బస్సు ఢీకొంది. దీంతో టెంపో బోల్తాపడింది. ఈ సంఘటనలో పలువురు భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న అంబులెన్స్ సిబ్బంది హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన భక్తులను చికిత్స నిమిత్తం స్థానిక అశ్విని ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాసుపత్రికి తరలించారు.

శ్రీవారి అభిషేక సేవలో సీబీఐ డైరెక్టర్
తిరుపతి, ఆగస్టు 17: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి అభిషేక సేవలో శుక్రవారం సీబీఐ డైరెక్టర్ అలోక్‌కుమార్ వర్మ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఆయనకు శ్రీవారి దర్శన ఏర్పాటు చేసిన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా, ఈఓ అనీల్‌కుమార్ సింఘాల్ స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.