చిత్తూరు

రూ.22.84కోట్లతో మదనపల్లె పట్టణాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, సెప్టెంబర్ 15: మదనపల్లె పట్టణం అభివృద్ధి పనులకు మంత్రి అమరనాథ్‌రెడ్డి శనివారం రూ.22.84కోట్లతో కూడిన పలు పనులకు భూమిపూజలు, శంఖుస్థాపనలు చేపట్టారు. శనివారం ఉదయం నీరుగట్టువారిపల్లె మార్కెట్‌యార్డు ఆవరణలో నిర్మించిన అన్నక్యాంటీన్ మంత్రి అమరనాధరెడ్డి ప్రారంభించారు. క్యాంటీన్‌లో కౌంటర్లు ప్రారంభించి, స్వయంగా టిఫిన్ అందజేశారు. అన్నక్యాంటీన్‌లోని ఇడ్లీ, వడ, పొంగల్‌ను మంత్రి అమరనాధరెడ్డి, ఆర్‌డిఓ గణేష్‌కుమార్, డిఎస్‌పి చిదానందరెడ్డి, తహశీల్దారు రంగస్వామి, మున్సిపల్ కమిషనర్ భవానిప్రసాద్ ఆరగించారు. సొసైటీ కాలనీలో రూ.38.20లక్షల అమృత్‌నిధులతో పార్కు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం 27వ వార్డు నక్కలదినె్నతండాలో, 26వార్డు గాంధీపురం దళితవాడలలో రూ.2లక్షల వంతున నిర్మించనున్న ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ ప్లాంటులకు మంత్రి అమరనాధరెడ్డి భూమిపూజలు చేశారు. అనంతరం పట్టణ శివారుప్రాంతం మధుసూదన్ సినిమాథియేటర్ సమీపంలోని ధోబీఘాట ఆవరణంలో రూ.413.14లక్షల నిధులతో ఇఎల్‌ఎస్‌ఆర్ నిర్మాణపనులను ప్రారంభించారు. అప్పారావువీధిలో బిటిరోడ్డుకు భూమిపూజలు చేశారు. అనంతరం వెంకప్పకోట సమీపంలో రూ.1595లక్షలతో ఎస్‌టిపి ప్లాంట్ నిర్మాణపనులు ప్రారంభం, స్వచ్చఆంధ్ర కార్పోరేషన్ నిధులు రూ.1.20కోట్లుతో కంపోస్టుయార్డు ప్రహరీగోడ నిర్మాణం, భూమి చదునుచేయుట, గ్రావెల్ ఫిల్లింగ్, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా ఏర్పాటుపనులకు శంఖుస్థాపన చేశారు. స్థానిక ఆర్టీసిబస్టాండు నుంచి జడ్‌పి హైస్కూల్, ప్రభుత్వబాలికల జూనియర్ కళాశాల, వారపుసంత మీదుగా మల్లికార్జున సర్కిల్ వరకు సిసిరోడ్డుకు శంఖుస్థాపనలు చేశారు. అనంతరం కోమటివానిచెరువు కట్టపై చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి అమరనాధరెడ్డి పరిశీలించారు. చెరువుకట్ట అభివృద్ధికి దత్తత తీసుకున్న డిఎస్‌పి చిదానందరెడ్డి, ట్రాఫిక్ సిఐ శ్రీనివాసులును మంత్రి అభినందించారు. వారపుసంతలో ఏర్పాటుచేసిన మరో అన్నక్యాంటీన్ ప్రారంభించిన మంత్రి అమరనాధరెడ్డి రూ.5లకే భోజనం చేశారు. జామియామసీదును సందర్శించారు. 16వార్డులో రూ.2లక్షలతో ఎన్‌టిఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్‌ప్లాంట్ ఏర్పాటు పనులను మంత్రి అమరనాధరెడ్డి ప్రారంభించారు. కమ్మరవీధి సర్కిల్‌లో ఏర్పాటుచేసిన వినాయకుని ప్రతిమను దర్శించుకున్న మంత్రి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆర్‌అండ్‌బి అతిధిగృహంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. అమరావతి రాజధానిలో 10ఎకరాలలో మసీదు, మరో పది ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, మరో పది ఎకరాలలో క్రైస్తవుల చర్చి నిర్మాణాలు కులమతాల బేదం లేకుండా చేపట్టేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారన్నారు. కార్యక్రమంలో మదనపల్లె ఆర్‌డిఓ గణేష్‌కుమార్, డిఎస్‌పి చిదానందరెడ్డి, మున్సిపల్ కమీషనర్ భవానిప్రసాద్, తహశీల్దారు రంగస్వామి, ఎంపీడీవో లక్ష్మీపతి, మార్కెట్‌కమిటీ చైర్మన్ గుర్రప్పనాయుడు, మున్సిపల్ చైర్మన్ శివప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ భవానిప్రసాద్, టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పుష్పావతి, టౌన్‌బ్యాంక్ చైర్మన్ నాదేళ్ల విద్యాసాగర్, టీడీపీ సీనియర్ నేతలు గంగారపు రామ్‌దాస్‌చౌదరి, బోడేపాటి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి, మైనార్టీ నాయకులు ఎస్.ఎ.మస్తాన్, ముబషర్ అహ్మద్, దాదూపీర్, గౌస్ ఆజామ్, జంగాల శివరామ్, దొరస్వామినాయుడు, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు పాచిగుంట మనోహర్‌నాయుడు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.