చిత్తూరు

అంగన్‌వాడీ కార్యకర్తలు అంకిత భావంతో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, అక్టోబర్ 16: అంగన్‌వాడీ కార్యకర్తలు అంకిత భావంతో పని చేసి, జిల్లాను పౌష్టికాహార లోపం లేని జిల్లా గా తీర్చి దిద్ధాలని కలెక్టర్ ప్రద్యుమ్న పిలుపు నిచ్చారు. మంగళవారం చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో చిత్తూరు డివిజన్ అంగన్‌వాడీ కార్యకర్తలు ఇతర అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్ వాడీలకు వచ్చే పిల్లలకు మంచి అలవాట్లతో పాటు, పలు అంశాలపై ఆలోచించే విధంగా వారిని తీర్చి దిద్ధాలన్నారు. ముఖ్యంగా అంగన్ వాడీ కార్యకర్తలు లక్ష్యాలను పెట్టు కొని వాటిని అధిక మించాలన్నారు. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. అంగన్ వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలు అరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలన్నారు. పౌష్టికాహార లోపం లేని రాష్ట్రంగా తయారు కావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాను కూడా పౌష్టికాహార లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దడానికి అందరూ కృషి చేయాలన్నారు. పౌష్టికాహార లోపం వల్ల పిల్లలు అనేక రకాల జబ్బులకు లోనవుతారన్నారు. పుట్టిన బిడ్డకు సరైన అహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం మార్చి 31 కల్లా పౌష్టికాహార లోపం లేని జిల్లాగా తయారు చేయాలని అదేశించిందని, కావున అందరూ సమష్టగా కృషి చేసి మన జిల్లాను డిసెంబర్ 31 నాటికే పౌష్టికాహార లోపం లేని జిల్లాగా తయారు చేయాలన్నారు. దేశంలోనే మన జిల్లా పౌష్టికాహార లోపం లేని జిల్లాగా గుర్తింపు పొందాలన్నారు. ఇప్పటికీ అనేక అంగన్‌వాడీ కేంద్రాలకు టీవీలను అందజేసామని, త్వరలోనే మిగిలిన వాటికి వీటిని అందిస్తామన్నారు. అ నెలాఖరులోగా సీ డీపీవోలు అన్ని అంగన్ వాడీ కేంద్రాలను తనిఖీ చేసి సమగ్ర వివరాలను అందజేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు శుభ్రంగా ఉండాలని, విధులు పట్ల నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బాలింతల విషయంలో అంగన్‌వాడీ కార్యకర్తలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో వారి అరోగ్య పరిస్థితులను తరచూ పరిశీలించాలని తెలిపారు. తదుపరి కలెక్టర్ బాల సంజీవిని తదితర అంశాలపై ఆరా తీశారు. సమావేశంలో ఐసిడిఎస్ పీడీ ఉషాఫణికర్ పలువురు సీ డీపీవోలు, చిత్తూరు డివిజన్ అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సామాన్య భక్తులకు గదుల కేటాయింపునకు పెద్దపీట
* వసతి కల్పన డిప్యూటీ ఈఓలు పార్వతి, బాలాజీ వెల్లడి
తిరుపతి, అక్టోబర్ 16: శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేసి గదులు కేటాయించామని టీటీడీ వసతి కల్పన విభాగం డిప్యూటీ ఈఓలు కోనేటి పార్వతి, బాలాజీ వెల్లడించారు. తిరుమలలోని మీడియా సెంటర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో అడ్వాన్స్ రిజర్వేషన్‌ను 50శాతం తగ్గించామని, సిఫార్సు లేఖలను స్వీకరించడంలేదని స్పష్టం చేశారు. పెరటాసి మాసం కావడంతో పెద్దసంఖ్యలో తరలి వచ్చిన భక్తులకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టామన్నారు. భక్తులు త్వరగా గదులు ఖాళీ చేసి ఇతర భక్తులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఇలా చేయడం వల్ల రోజుకు అదనంగా 400 గదులు అందుబాటులోకి వచ్చాయన్నారు. బ్రహ్మోత్సవాల్లో విధులు నిర్వహించేందుకు వచ్చిన టీటీడీ డిప్యూటేషన్ అధికారులకు, సిబ్బందికి, పోలీసులకు, ఆర్టీసీ, అగ్నిమాపక, అటవీ విభాగాలకు, మీడియా ప్రతినిధులకు గదులు కేటాయించామని వెల్లడించారు. పీఏసీ 1, పీఏసీ 2లో కలిపి 16 హాళ్లలోలాకర్ సౌకర్యం ఉందని, ఒక్కోహాల్లో 500 మంది భక్తులు వసతి పొందవచ్చని తెలిపారు. వసతికల్పనా విభాగం 1 పరిధిలో గదుల అద్దె ద్వారా 2015లో వార్షిక బ్రహ్మోత్సవాల్లో రూ.61.44 లక్షలు ఆదాయం రాగా, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రూ. 68.38 లక్షలు ఆదాయం లభించిందన్నారు. వసతి కల్పన విభాగం 2లో ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరు రోజుల్లో రూ.1.01 కట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. ఈ విలేఖరుల సమావేశంలో ఏఈఓ ఎవిఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.