చిత్తూరు

వర్షం ధాటికి తిరుమలలో తెగిపడిన విద్యుత్ తీగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, మే 6: తిరుమల్లో శుక్రవారం కురిసిన వర్షం ధాటికి సరస్వతి నిలయం వద్ద హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో సుమారు నాలుగు గంటలపాటు స్థానికులు నివసించే బాలాజీ నగర్, దుకాణం సముదాయాల్లో విద్యుత్ అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న టిటిడి విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు. సుమారు నాలుగు గంటలపాటు శ్రమించి విద్యుత్ వైర్లను అమర్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అయితే విద్యుత్ వైర్లు తెగిపడ్డ సమయంలో అటుగా ఎవరూ వెళ్లకపోవడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.