చిత్తూరు

వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 11: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. మంగళవారం ఆయన తిరుమలలోని ఆలయ మాడవీధులు, ఔటర్ రింగ్ రోడ్డు, కల్యాణవేదిక, నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏర్పాటు చేసిన షెడ్లు, క్యూలైన్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా జేఈఓ విలేఖరులతో మాట్లాడుతూ ముక్కోటి పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవాలన్న తలంపుతో తిరుమలకు వచ్చే భక్తులు ఎక్కువ సమయం క్యూలైన్లలో వేచి ఉండకుండా తమ తిరుమల యాత్రను ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్‌ఈ-2 రామచంద్రా రెడ్డి, వెంకటేశ్వర్లు, వీఎస్వో మనోహర్, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శర్మిష్ట, అన్నప్రసాదం ప్రత్యేక అధికారి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
19న చక్రస్నానం
వైకుంఠ ద్వాదశి పర్వదినాన స్వామి పుష్కరణి తీర్థ ముక్కోటి కూడా తిరుమలలో ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా తెల్లవారు జామున 4.30 నుంచి 5.30 గంటల వకు శ్రీ చక్రత్తాళ్వార్లను నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లి వరాహస్వామి ఆలయం చెంత స్వామివారి పుష్కరణిలో చక్రస్నానం నిర్వహిస్తారు.