చిత్తూరు

రైతుల కళ్లల్లో ఆనందం కోసమే జలహారతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దతిప్పసముద్రం/ములకలచెరువు, జనవరి 22: రైతుల కళ్లల్లో ఆనందం చూడడానికే జలహారతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావు వెల్లడించారు. మంగళవారం పిటియం మండలంలో జరిగిన జలహారతి కార్యక్రమానికి ముందు నిర్వహించిన సమావేశంలో పాలొన్న ఆయన మాట్లాడుతూ రాయలసీమలోని ప్రతి రైతు కళ్లల్లో ఆనందం చూడడానికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జలహారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశం ఆనంతరం అధికారులు హంద్రీ-నీవా జలాల వద్దకు మంత్రులు ఉమామహేశ్వర్‌రావు, అమర్‌నాథ్‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులను పూర్ణకుంభంతోపాటు మేళాతాళలతో తీసుకువచ్చారు. బ్రాహ్మణుల వేద మంత్రాలతోపాటు పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలతో పాటు ఆయునం అందించి అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య వేలాది మంది ప్రజలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పలువురు మహిళలతోపాటు పిటియం చెరువుకు కృష్ణమ్మను స్వాగతం పలుకుతూ జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పిటియం చెరువుకు అమర్చిన తూము ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు ప్రజలు మంగళహారతులు, పసు, కుంకుమ కార్పూరంతో హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి.శంకర్‌యాదవ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, దొరబాబు, జడ్పీ చైర్మన్ గీర్వాణిచంద్రప్రకాశ్, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ గిరిషా, ఎస్పీ విక్రాంతి పాటిల్, మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.