చిత్తూరు

ఎన్నికల విధులు సమర్ధవంతంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఫిబ్రవరి 19 : జిల్లాలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను నోడల్ అధికారులు సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గిరీష ఆదేశించారు. మంగళవారం చిత్తూరు సచివాలయంలో ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గిరీష మాట్లాడుతూ జిల్లాలో ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి నోడల్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం పలు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ మేరకు అధికారులు కట్టుబడి ఉండాలన్నారు. ఎన్నికల నియమావళిని అందరూ పాటించాలన్నారు. ముఖ్యంగా ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించడానికి పలు బృందాలు ఏర్పాటు చేశామని, ఈ బృందాల్లోని అధికారులు వారి బాధ్యతలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి, ఎటువంటి సమస్యలైనా నివృత్తి చేసుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా 1950 టోల్‌ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొచ్చిందని, దీనిపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు గ్రామాల్లో ప్రజల్ని చైతన్యపరచాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లోని ఏర్పాట్లను పరిశీలించి ఎన్నికల సమయానికి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఇందులో ఎటువంటి పొరపాట్లు చోటుచేసుకున్నా పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌వో గంగాధర్‌గౌడ్, ఇతర నోడల్ అధికారులు పాల్గొన్నారు.
జేసీకి తహశీల్దార్ల వినతి :
జిల్లాలో ఇటీవల ప్రకటించిన ఓటర్ల జాబితాలో ఎటువంటి పొరపాట్లు చోటుచేసుకున్నా అందుకు తహశీల్దార్లే బాధ్యత వహించే విధంగా ధ్రువపత్రాలు ఇవ్వాలన్న కలెక్టర్ ఆదేశాలను పునఃపరిశీలించాలని జిల్లా రెవెన్యూ సంఘం ఆధ్వర్యంలో పలువురు తహశీల్దార్లు జేసీ గిరీషకు విన్నవించారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోను లేనివిధంగా ఈ జిల్లాలోనే ఇటువంటి ఆదేశాలు ఇచ్చారని, ఓటర్ల జాబితాలో తమనే బాధ్యత వహించే విధంగా ధ్రువపత్రాలు ఇవ్వాలని ఆదేశించడం దారుణమని తెలిపారు. దీంతో జేసీ వీరి వినతులపై ఢిల్లీలో ఉన్న కలెక్టర్‌తో ఫోన్‌లో సంప్రదించారు. దీనిపై సానుకూలంగా పరిష్కారమయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జేసీకి సూచించారు. దీంతో జిల్లా జాయింట్ కలెక్టర్ తదుపరి తహశీల్దార్లతో చర్చించి సమస్యను పరిష్కరించారు.