చిత్తూరు

చెక్‌పోస్టు వద్ద ముమ్మర తనిఖీలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మే 15: తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల నేపధ్యంలో చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద నిరంతరం తనిఖీలు కొనసాగాలని రాయలసీమ ఐజి శ్రీ్ధర్‌రావు జిల్లా పోలీసులను ఆదేశించారు. ఆదివారం చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఎస్పీ శ్రీనివాసరావుతో పాటు ఐజి పరిశీలించారు. తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికలు కమిషనర్ ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన 27 చోట్ల చిత్తూరు పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఐజి బెలుపల్లి, రుమానపల్లి, కొత్తూరు తదితర ప్రాంతాల్లోని చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఐజి శ్రీధర్‌రావు మాట్లాడుతూ ఈ చెక్‌పోస్టు వద్ద నిరంతరం నిఘా కొనసాగాలని, ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా సరిహద్దు కావడంతో ఈ ప్రాంతం నుంచి మద్యం, నగదు వెళ్లే అవకాశం ఉన్న తరుణంలో చెక్‌పోస్టు సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. తమిళనాడులో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు చెక్‌పోస్టుల కొనసాగించాలన్నారు. మద్యం, నగదు తరలిస్తున్న వారు ఎంతటి వారైనా అరెస్టు చేయాలన్నారు. సరిహద్దులో గట్టి నిఘా ఉంచాలన్నారు. తదుపరి చెక్‌పోస్టు వద్ద ఉన్న పోలీసు సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పమలనేరు డిఎస్పీ శంకర్ పాల్గొన్నారు.