చిత్తూరు

కృష్ణా పుష్కరాలకు జూన్‌లో శ్రీవారి నమూనా ఆలయ నిర్మాణం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 23 : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నమూనా ఆలయాన్ని కృష్ణా పుష్కరాలలో ఏర్పాటుకు, ఇతర ఇంజనీరింగ్ పనులకు సంబంధించి జూన్ నెలలో మొదలుపెట్టేలా కార్యాచరణ ప్రణాళికలు తయారుచేయాలని ఇంజనీరింగ్ అధికారులను టిటిడి కార్యనిర్వాహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం సీనియర్ అధికారులతో ఇఓ వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12వ తేదీ ప్రారంభం సందర్భంగా సంబంధిత శాఖ అధికారులు వారి వారి శాఖలకు సంబంధించిన పనులను ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులను కోరారు. పుష్కరాల్లో టిటిడి పుస్తక విక్రయశాలలో ఆధ్యాత్మిక, ధార్మిక పుస్తకాలు, సిడిలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఇప్పటి నుంచి ముద్రణకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. టిటిడి ముద్రణ విభాగం ముద్రించే పుస్తకాల ఖరీదు నిర్థారించేందుకు తిరుపతి జెఇఓతో కూడిన కమిటీని ఇఓ ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఎన్ ముక్తేశ్వరరావు, ఎఫ్‌ఏ అండ్ సిఎఓ బాలాజీ, పిఆర్‌ఓ డాక్టర్ టి రవి, ముద్రణ విభాగం డిప్యూటీ ఇఓ వీరబ్రహ్మంలతో ఏర్పాటు చేశారు. రాష్టవ్య్రాప్తంగా ఉన్న టిటిడి కల్యాణ మండపాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని సిఇని ఆదేశించారు. అదేవిధంగా విజయవాడ, మంగళగిరి తదితర ప్రాంతాల్లో ఉన్న కల్యాణ మండపాల్లో మరమ్మతు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. సప్తగిరి మాసపత్రిక చందాదారులకు పుస్తకాలు అందించేందుకు ఎస్వీబీసీలో ప్రచారం చేయాలని, ఇందుకు కాల్‌సెంటర్‌ను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. తిరుమల కాలినడక మార్గంలో భక్తిపాటలు నిరంతరం భక్తులను అలరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎలక్ట్రికల్ ఎస్‌ఇని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఏ పాటలు ప్రసారం చేయాలనే విషయంపై రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఎన్ ముక్తేశ్వరరావు, ఎస్వీబీసీ సిఇఓ నరసింహారావు, ముద్రణ విభాగం ప్రత్యేకాధికారి ప్రయాగ రామకృష్ణ, పిఆర్‌ఓ డాక్టర్ టి రవితో కమిటీని వేశారు. తిరుమల ఘాట్‌రోడ్లకు ఇరువైపులా భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేవిధంగా వివిధ రకాల పూలమొక్కలు, శ్రీ గంధం మొక్కలు నాటాలని సంబంధిత అధికారులను ఇఓ ఆదేశించారు. ఈ సమీక్షలో టిటిడి న్యాయాధికారి వెంకటరమణ, ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి ఎన్ ముక్తేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.