చిత్తూరు

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికోట, జనవరి 2: తెలుగుదేశ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే తమ లక్ష్యమని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వెల్లడించారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా కృష్ణాపురంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజాసంక్షేమ పథకాలు సజావుగా అమలు చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అధికంగా ఉన్న చోట తొలగించిన పాఠశాలలను యథావిధిగా కొనసాగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్మార్ట్‌వార్డుల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఎన్టీఆర్ వైద్య పరీక్షల కింద నూతనంగా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని ఎమ్మెల్సీ గౌనిశ్రీనివాసులు అన్నారు. కొమ్మరమడుగు వద్ద జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అలైన్‌మెంట్‌ను మార్చాలని ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి మంత్రిని కోరారు. అంతకుమునుపు గోనుమాకులపల్లిలో జన్మభూమి కార్యక్రమం విజయవంతమైంది. ఈకార్యక్రమంలో పలమనేరు ఇన్‌చార్జి బోస్, ఎ ఎంసి చైర్మన్ రామచంద్రనాయుడు, ఎంపిపి సులోచనరంగనాద్, నియోజకవర్గ నోడల్ అధికారి చక్రపాణి, అధికారులు రవిశంకర్‌వర్మ, ఎంపిడి ఒ రమేష్, తహశీల్దార్ నటరాజ్, డి ఎప్ ఒ శివన్న, సీ ఐ రాజశేఖర్‌తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘జన్మభూమి’ని అడ్డుకున్న టి పి కోట గ్రామస్థులు
నాగలాపురం,జనవరి 2: భూపతేశ్వర కోన ప్రాజెక్టును టి పి కోట రెవెన్యూకు చేర్చాలని శనివారం జరిగిన జన్మభూమికి వచ్చిన అధికారులను టిపి కోట గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా టిపి కోట గ్రామస్థులు మాట్లాడుతూ భూపతేశ్వర కోన ప్రాజెక్టు , టి పి కోట రెవెన్యూలో ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నా కానీ అధికారులు బీరకుప్పంకు చెందినట్లుచెప్పడం ఎంత వరకు సమంజసం అని , అదేవిధంగా బీరకుప్పం గ్రామానికి, భూపతేశ్వర కోన ప్రాజెక్టుకు సంబంధం లేకపోయినా ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఆయకట్టు సర్పంచ్, వైస్ సర్పంచులు నియమించడం ఎంత వరకు న్యాయమని గ్రామస్థులు దాదాపు గంటపైన రోడ్డుపై నిల్చుకొని అధికారులను నిలదీశారు. మా గ్రామంలో జన్మభూమి నిర్వహించవద్దని మొదటి తమ సమస్యలు పరిష్కారం చేసిన తరువాతే మా గ్రామంలో మీరు జన్మభూమి నిర్వహించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దీంతో అధికారులు టిడిపి నాయకుడు యాచంద్రనాయుడు, మురళి ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారు నిరాకరించడంతో అధికారులు వారికి సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన అనంతరం వారు జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గ్రామస్థులు ఒప్పుకున్నారు. అనంతరం అధికారులు పాత రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడతూ టి పి కోట రెవెన్యూ పరిధికి భూపతేశ్వర కోన ప్రాజెక్టు చేరేవిధంగా తామురికార్డులు తయారుచేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని అన్నారు. ఈ సమయంలో ప్రజలు కొంత మంది గతంలో ఇచ్చిన జన్మభూమి అర్జీలను ఇంత వరకు పరిష్కారం చేయలేదని కొంత ఆగ్రహంతో అధికారులను ప్రశ్నించడంతో జన్మభూమి ప్రత్యేకాధికారి మణికంఠేశ్వరన్ ప్రజలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసి దురుసుగా మాట్లాడటం కూడా జరిగింది. దీంతో ప్రజలుకూడా ప్రత్యేకాధికారిపై తిరగబడటంతో ఆయన సద్దుమణిగారు. అనంతరం టిపికోట, టిపి పాళ్యంలో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పలు సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు జన్మభూమిని ఒక పద్ధతి ప్రకారం నిర్వహించకుండా వారి ఇష్టాను సారంగా నిర్వహించడంతో ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు యాచంద్రనాయుడు, ఎంపిడివో రుక్మిణి, తహశీల్దార్ వెంకట్రాయులు, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు మురళి, బాలాజిరెడ్డి, పార్థిబన్, ఎంపిపి కల్పన, జడ్పిటసి సుజాత, జన్మభూమి ప్రత్యేకాధికారి మణికంఠేశ్వరన్ మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.