చిత్తూరు

మందకృష్ణ అరెస్టుకు నిరసనగా సిఎం దిష్టిబొమ్మ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, మే 30: రాష్టప్రర్యటనలో భాగంగా కృష్ణజిల్లా ఇబ్రహీం పట్టణంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో బయలుదేరిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందక్రిష్ణను అరెస్టుచేసి నిర్భంధించడాన్ని నిరసిస్తు సోమవారం మదనపల్లె పట్టణం జాతీయరహదారిపై ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా, రాస్తారోకో చేపట్టి సిఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. భారత పౌరుడుగా దేశంలో ఏప్రాంతంలో అయినా తిరిగే స్వేచ్చ రాజ్యాంగం కల్పించిందని, దీనిని ఎపి సిఎం చంద్రబాబుకు ధిక్కరించే అధికారం ఎవరిచ్చారంటూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికారప్రతినిధి నరేంద్రబాబు, జిల్లా ప్రధానకార్యదర్శి ఆరేటివాసు, జిల్లా కార్యదర్శి మోపూరి మనోహర్‌లు విమర్శించారు. మందక్రిష్ణ అరెస్టుకు నిరసనగా పట్టణంలోని ముంబై-చెన్నై జాతీయ రహదారి మల్లికార్జున సర్కిల్‌లో ధర్నా, రాస్తారోకో చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. అనంతరం సిఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధంచేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 50లక్షల మంది మాదిగలు ఉన్నారని, మా హక్కులపై పోరాడే నాయకుడు మందక్రిష్ణను అరెస్టుచేయడం అప్రజా స్వామ్యమన్నారు. ఎస్సీవర్గీకరణపై చేస్తున్న శాంతియుత పోరాటాలకు చట్టాన్ని అడ్డుపెట్టుకుని అరెస్టులు, నిర్భంధాలు చేయడం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగల పట్ల చంద్రబాబు చేస్తున్న పాపాలకు త్వరలోనే వందరెట్లు మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. అక్రమంగా అరెస్టుచేసిన మందక్రిష్ణను బేషరుతుగా విడుదలచేసి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బుజ్జీ, సిద్ధులు, శంకర్, కిషోర్ పాల్గొన్నారు.