చిత్తూరు

గ్రామస్థుల సహకారంతో రహదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బైరెడ్డిపల్లె, మే 30: మండలంలోని శనిపల్లె నుండి రామసముద్రంకు సమీప దారి కోసం రైతులు తమ భూమిలో కొంత మేరకు స్థలం వదులు తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు చందాలు వేసుకొని జెసిబితో సుమారు రెండు కిలోమీటర్ల రహదారి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. గతంలో ఈ రహదారి ఉన్న రైతులు ఆక్రమణలు చేపట్టడంతో కాలీ బాటగా నెలకొన్నది. ప్రభుత్వం ఈ రహదారికి ప్రత్యామ్నాయంగా మరో రహదారి నిర్మించింది. ఈ రహదారిలో శనిపల్లె నుండి రామసముద్రానికి వెళ్లాలంటే రెండున్నర కిలోమీటరు దూరం ప్రయాణించాలి. ప్రస్తుతం వ్యవసాయ భూముల్లో నూతనంగా నిర్మించుకుంటున్న రహదారిలో ఒక కిలోమీటరు దూరం ప్రయాణిస్తే రామసముద్రం చేరుకోవచ్చు. దీంతో ఒకటిన్నర కిలోమీటరు దూరం తగ్గినట్టయ్యింది. గ్రామస్థులు సుమారు 30వేల రూపాయలు చందాలతో తాత్కాలిక రహదారి ఏర్పరచు కోవడం విశేషం. ఉపాధిహామీ పథకం ద్వారా తాత్కాలిక రహదారిని పక్కా రహదారిగా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, సర్పంచ్ కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.