చిత్తూరు

రాణోజిరావు ఇకలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బైరెడ్డిపల్లె, మే 30: మండలంలోని విరుపాక్షిపురంలో మరాఠి కులానికి చెందిన రాణోజిరావు వేలాది మంది పక్షవాత రోగులకు ప్రాణబిక్ష పెట్టిన ఘనత దక్కించుకున్నారు. ఆయన సుమారు 75ఏళ్లుగా ఈ గ్రామంలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి వచ్చిన పక్షవాత రోగులకు మందు ఇచ్చి వేలాది మందికి ప్రాణబిక్ష పెట్టారు. ఇది చిరుగ్రామమైనప్పటికి ప్రతిరోజు సుమారు వంద వాహనాలతో పక్షవాత రోగులు ఉదయానే చేరుకొని పక్షవాత మందు సేవించేవారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రులు, హైకోర్టు జడ్జిలు, హరేరామ హరేకృష్ణలో ఉన్నత పదవిలో వ్యక్తి, పలువురు వైద్యులు సైతం ఈ గ్రామానికి విచ్చేసి మందును సేవించి ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు. అటువంటి వైద్యులు ఆదివారం హఠాత్తుగా మరణించడంతో విరుపాక్షిపురంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన పార్థివదేహాన్ని సోమవారం పలమనేరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి ఆర్‌విఎస్‌బోస్, బైరెడ్డిపల్లె మండల టిడిపి అధ్యక్షుడు డాక్టర్ కదిరప్ప, టిడిపి నాయకులు జయకుమార్, కృష్ణవేణమ్మ, సుబ్రహ్మణ్యంశెట్టి, జలందర్, విల్వనాథ్, చెన్నారెడ్డి పలువురు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.