చిత్తూరు

మాజీ సైనికులంటే అంత అలుసా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, మే 30: ఇచ్చినపట్టాలకు స్థలాలు చూపాలంటూ అధికారుల చుట్టు తిరుగుతుంటే మాజీ సైనికులంటే అంత అలుసా..? అంటూ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచెర్ల శ్రీనివాసులునాయుడు సోమవారం మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహారదీక్షకు బైఠాయించారు. నాలుగేళ్ళ సుదీర్ఘ పోరాట ఫలితంగా నాటి ఎమ్మెల్యే షాజహాన్‌బాష, రెవెన్యూ తహశీల్దారు అమరేంద్రబాబు పట్టాలు మంజూరు చేశారు. ఇచ్చిన పట్టాలకు స్థలాలు చూపడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని మాజీ సైనికుల సంఘం మదనపల్లె డివిజన్ అధ్యక్షులు కె.శ్రీనివాసులునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 2009 నుంచి మాజీ సైనికులకు ఇంటిపట్టాలు మంజూరు చేయాలని పోరాటాలు చేస్తున్నామని, దీంతో స్పందించిన అప్పటి ఎమ్మెల్యే షాజహాన్‌బాష 2014లో 60మంది మాజీ సైనికులకు పట్టాలు మంజూరు చేశారన్నారు. ఇచ్చినపట్టాలకు స్థలాలు చూపాలని రెవెన్యూ అధికారులకు విన్నవిస్తుంటే పట్టించుకోవడం లేదని, అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారన్నారు. ప్రాణాలు సైతం పణంగా పెట్టి దేశ సరిహద్దులలో విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన మాజీసైనికులకు ప్రభుత్వం ఐదెకరాల వ్యవసాయ భూమి, ఓ ఇంటిపట్టా మంజూరు చేయాలని నిబంధన ఉన్నప్పటికీ డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు మాజీసైనికులపై నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.