చిత్తూరు

చిత్తూరు కోర్టుకు హాజరుకాని సంగీతా ఛటర్జీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మే 30: ఎర్రచందనం అక్రమ రవాణాలో పేరుమోసిన స్మగ్లర్లకు మధ్యవర్తిగా ఉంటూ ఆర్థిక లావాదేవీలను నడుపుతున్న కలకత్తాకు చెందిన మహిళా స్మగ్లర్ సంగీతా ఛటర్జి కలకత్తా కొర్టు ద్వారా ముందస్తు బెయిల్ తీసుకొన్నట్లు చిత్తూరు పోలీసులకు సమాచారం అందింది. చిత్తూరు జిల్లాలో పు కేసులు నమోదయిన నేపథ్యంలో సోమవారం చిత్తూరు కోర్టుకు ఆమెహాజరు కావాల్సిఉంది, అయితే తనకు ఆరోగ్యం సరిగా లేదని కలకత్తా కొర్టులో పిటీషన్ ధాఖలు చేయడంతో కోర్టు ఈమేరకు బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం. సోమవారం సంగీతా ఛటర్జీ చిత్తూరు కోర్టుకు హాజరు అవుతారన్న సమాచారంతో కోర్టువద్ద పోలీసులతో పాటు మీడియా ప్రతినిధులు సాయంత్రం వరకు వేచి ఉండాల్సి వచ్చింది. ఇటీవల చిత్తూరు టాస్క్ఫోర్సు పోలీసులు కలకత్తాకు చెందిన బడా స్మగ్లర్ లక్ష్మణన్ అరెస్టుచేసి పిడి చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో లక్ష్మణన్ ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. పోలీసుల విచారణలో లక్ష్మణన్ ఇచ్చిన సమాచారంతో కలకత్తాలో ఇటీవల పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో ప్రధానంగా లక్ష్మణన్ భార్య ఎయిర్ హోస్ట్ ఆయిన సంగీతా ఛటర్జి ఇంటిపై పోలీసులు దాడులు చేశారు. ఆమెకు సంబంధించిన పలు బ్యాంకు ఖాతాలు, లాఖర్లుతో పాటు కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. లక్ష్మణన్ జైలులో ఉన్నప్పటి నుంచి అతని భార్య అయిన సంగీతా ఛటర్జినే ఎర్రచందనం స్మగ్లర్లకు మధ్యవర్తిగా ఉంటూ ఆర్థిక లావాదేవీలను నిర్వహించడతో పాటు, ఎర్రచందనం ఎగుమతులు దిగుమతుల వ్యవహారంలో కీలక పాత్ర పోషించి. ఆన్‌లైన్ ద్వారా సుమారు 10 కోట్ల వరకు ఆర్థిక వ్యవహారాను నడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను అరెస్టు చేసి కలకత్తా కోర్టులో హాజరు పరిచారు. దీంతో అక్కడి న్యాయవాదుల సహకారంతో ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. ఈనేపథ్యంలో చిత్తూరు జిల్లాలో సంగీతా ఛటర్జిపై పలు కేసులు నమోదు అయ్యాయని విచార నిమిత్తం ఆమెను తమకు అప్పగించాలని జిల్లా పోలీసులు కలకత్తా కొర్టులో ఫిటీషన్ దాఖలు చేశారు. దీంతో ఈనెల 18న చిత్తూరు కోర్టురు హాజరు కావాల్సి ఉండగా అమె మందస్తు పిటీషన్‌తో బెయిల్‌ను కోర్టు పొడిగించింది. తాజాగా సోమవారం చిత్తూరు కోర్టుకు సంగీతా ఛటర్జీ హాజరు కావాల్సి ఉండగా తనకు ఆరోగ్యం సరిగా లేదని తదుపరి పిటీషన్ దాఖలు చేయడంతో కలకత్తా కోర్టు వచ్చేనెల 5వ తేదీ వరకు బెయిల్ పొడిగించినట్లు సమాచారం. అయితే ఈసారి పక్కా ప్రణాళికతో సంగీతా ఛటర్జిని చిత్తూరుకు తీసుకొచ్చేందుకు జిల్లా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. టాస్క్ఫోర్సు డిఎస్పీ గిరిధర్ మాట్లాడుతూ వాస్తవంగా సంగీత ఛటర్జిపై చిత్తూరు జిల్లాలో పలు కేసులు నమోదయ్యాయని వీటి విచారణ కోసం కోర్టుకు హాజరు కావాల్సి ఉందన్నారు. అయితే కలకత్తా కోర్టు ఆమెకు బెయిల్ పొడిగించినట్లు సమాచారం వచ్చిందంటూ తదుపరి పిటీషన్ వేయనున్నట్లు తెలిపారు.