చిత్తూరు

మహానాడు బ్రహ్మాండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, మే 30 : మహానాడు ఉత్సవం బ్రహ్మాండంగా జరిగిందని రాష్ట్ర గనుల శాఖామంత్రి పీతల సుజాత అన్నారు. సోమవారం ఆమె శ్రీ కాళహస్తీశ్వరాలయంలో రాహు-కేతు పూజ చేయించుకున్నారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ తిరుపతిలో మూడు రోజుల పాటు మహానాడు ఉత్సవం బ్రహ్మాండంగా జరిగిందన్నారు. నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఆనందంగా పాల్గొన్నారని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుతూ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. శ్రీ కాళహస్తీశ్వరాలయంలో రాహు-కేతు పూజలు చేయించుకుంటే దోషాలు తొలగుతాయని పెద్దలు చెప్పడంతో పూజ చేయించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రికి దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు, సభ్యులు, జిల్లా క్వారీ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు మల్లికార్జుననాయుడు తదితరులు స్వాగతం పలికారు. రాహు-కేతు పూజల తర్వాత స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనం తర్వాత దక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితులు ఆశీర్వదించారు. ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు తీర్థ ప్రసాదాలు, స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు.