చిత్తూరు

టిటిడి స్థానిక ఆలయాల్లో పచ్చదనం పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 30 : టిటిడి పరిధిలోని శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాల్లో భక్తులకు ఆహ్లాదాన్ని పెంచేలా మొక్కల పెంపకం చేపట్టి తద్వారా పచ్చదనం పెంచాలని టిటిడి ఇవో డాక్టర్ డి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో సోమవారం వివిధ విభాగాధిపతులతో వారాంతపు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల ఘాట్ రోడ్డులో భక్తులను ఆకట్టుకునేలా రంగురంగుల పూల మొక్కలు పెంచాలన్నారు. తిరుపతి నగర సుందరీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అలిపిరి మార్గంలో రోడ్డుకు ఇరువైపులా వ్యర్థాలు పడేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. టిటిడి స్థానిక ఆలయాల్లో ప్రసాదాల దిట్టానికి నిర్ధిష్టమైన ప్రమాణాలు పాటించాలన్నారు. ఈ నెల 22 నుంచి 29 వరకు జరిగిన శుభప్రదంపై సమీక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాదికి పాఠ్యాంశాలను మరిన్ని మార్పులు చేయాలని సూచించారు. అలాగే ఎస్వీబిసి ఛానల్‌లో వచ్చే కార్యక్రమాలను తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించేలా శుభప్రదం రూపొందించాలన్నారు. టిటిడి కల్యాణ మండపాలను క్రమం తప్పకుండా పరిశీలించి ఏవైనా మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతవరంలోని శ్రీవారి ఆలయం, ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఇంజినీరింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. శ్రీనివాసం, విష్ణునివాసం వసతి భవన సముదాయాల్లో అవసరమైన ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని అన్నారు. శ్రీనివాసంలోని వసతులను సులువుగా గుర్తేంచేందుకు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీవారి మెట్టు కాలిమార్గంలో భక్తుల సౌకర్యార్థం లగేజి సెంటర్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. టిటిడి సంస్థల్లో విద్యుత్ మరమ్మతులకు సంబంధించి ఏపి ఎస్‌పిడిసిఎల్ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన డివిజినల్ ఇంజినీర్ ఇచ్చిన నివేదికపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 2017 నూతన సంవత్సరానికి రూపొందించే క్యాలెండర్లు, డైరీలకు సంబంధించి ఇప్పటి నుంచే కార్యచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. టిటిడి ప్రచురణలకు నిర్దిష్టమైన విధానాలు అవలంబించాలన్నారు. ఎస్వీబిసిలో ప్రసారమయ్యే కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులను ఆకట్టుకునేలా నాణ్యంగా రూపొందించేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఇవో పోల భాస్కర్, న్యాయాధికారి వెంకటరమణ, ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి ముక్తేశ్వరరావు, సిఇ చంద్రశేఖర్‌రెడ్డి, పిఆర్‌వో రవి పాల్గొన్నారు.