చిత్తూరు

తిరుపతిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 30: దేశ విదేశాల నుంచి తిరుపతి నగరానికి విచ్చేస్తున్న వారికి ఆహ్లాదకరమైన, ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేవిధంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర శాసన మండలి పేపర్ లేయిడ్ అన్ ది టేబుల్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర బాబూ రాజేంద్ర ప్రసాద్ తుడ, నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. కమిటీ తిరుపతిలో మూడు రోజుల పర్యటన చేయనున్న నేపథ్యంలో సోమవారం తుడా, ఎపిఎస్‌పిడిసిఎల్ అధికారులతో 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ల పేరాలపై స్థానిక పద్మావతి అతిథి భవనంలో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం జరిగిన విలేఖర్ల సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో 54 కార్పొరేషన్లు, వివిధ బోర్డులు ప్రభుత్వ రంగ సంస్థలను ఆడిట్ నివేదికలు తెప్పించుకొని మా కమిటీ శాసన మండలికి అప్పగించడం జరుగుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో మా కమిటీ బృందాలు వివిధ కార్పొరేషన్లు, వివిధ బోర్డుల అధికారులతో, సభ్యులతో సమీక్షించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజా సంక్షేమం కోసం తమ నిర్ణయాలు ఉపయోగపడేవిధంగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ప్రధానంగా తిరుపతిలో ట్రాఫిక్ నియంత్రణకు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, ఔటర్ రింగ్‌రోడ్డుల పనులను టిటిడి సహకారంతో చేపట్టాలని అధికారులకు సూచించామని, ఆ పనులను వేగవంతం చేయడంపై కూడా సమీక్షించామని అన్నారు. తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరంగా దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. ఇంకా ఇటీవల అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడమే కాకుండా శ్రీసిటీలో పలు విదేశీ కంపెనీలు భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. ఏర్పేడు వద్ద అనేక కేంద్ర విద్యాసంస్థలు కూడా వస్తున్నాయని అన్నారు. అమృత యోజన పథకం ద్వారా అల్పాదాయ వర్గాలకు గృహవసతి కల్పించడానికి తుడా అధికారులు ఆమోదం తెలిపాయన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఎల్‌ఇడి బల్బులపై ప్రజలకు అవగాహన కల్పించి ఇంటింటికి బల్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అధికారుల పర్యవేక్షణలో వేగవంతం చేయడానికి ఎస్‌పిడిసిఎల్ అధికారులు అంగీకరించారన్నారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికారులకు తెలిపామన్నారు. ఇక సోలార్ పంప్ సెట్లను రైతులకు వీలైనంత తక్కువ ధరకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. ఇక అవసరమైతే బ్యాంకు రుణాల ద్వారా రైతులకు చెల్లించే మొత్తాన్ని పొందేవిధంగా కూడా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు నిరంతర సరఫరా చాలా బాగుందని ఆయన తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను ఆడిట్ రిపోర్టును ఎపిఎస్‌పిడిసిఎల్ అధికారులు అందించారన్నారు. అలాగే తుడా అధికారులు ఇచ్చిన 2013-14, 2014-15 ఆడిట్ రిపోర్టును పరిశీలించామన్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు పప్పుల చలపతిరావు, డి శ్రీనివాసులునాయుడు, శాసన కమిటీ అధికారులు కృష్ణారావు, ఆర్ శైలజ, తుడా ప్రత్యేకాధికారి వినయ్‌చంద్, కార్యదర్శి మాధవీలత, ఎపిఎస్‌పిడిసిఎల్ అధికారులు సయ్యద్‌బాషా, పి పుల్లారెడ్డి, వనజ, ఎం నరసింహులు, వేణుగోపాల్ పాల్గొన్నారు.