చిత్తూరు

రైతులు, ప్రజలకు బాబు చేసింది ‘మహాదగా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 31: పేదరికం తన కులం మతం అని 35వ మహానాడు వేధికగా చెప్పుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కాంగ్రెస్ జిల్లా ఇన్‌చార్జ్ నాయకులు మార్టిన్, డిసిసి అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి నేతృత్వంలో భిక్షాటన చేసి పొందిన 3500 వేల రూపాయల నగదును డిడి రూపంలో నిరుపేద బాబుకు అని రాసి పంపారు. మహానాడులో బాబు చెప్పిన మాటలన్నీ సత్యదూరాలని ప్రజలకు తెలియజేసేందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా ఎన్టీ ఆర్ సర్కిల్ వద్ద రైతులు, చేనేత రైతులు, ప్రజలతో భిక్షాటనచేశారు. ఈ సందర్భంగా వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ప్రజలను దగాచేయడంలో అందివేసిన చేయి అన్నారు. తనది పేదకులం,పేదమతం అని చెప్పుకున్న బాబు విమానాల్లో తిరగుతూ సుఖవంతమైన జీవితం ఎలా గడుపుతున్నాడో చెప్పాలన్నారు. ఆయనకు ప్రేమ ఉంటే ప్రతి పేదవాడూ విమానాల్లో తిరిగేలా తగిన సౌకర్యాలు ఎందుకు కల్పించకూడడో చెప్పాలన్నారు. రైతులకు , డ్వాక్రా మహిళలకు చేనేత వృత్తుల వారికి తాను అన్నిరకాలుగా ఆదుకున్నానని వేదికపై ప్రకటించడం ఆయన అవకాశవాద రాజకీయానికి అద్దంపడుతున్నాయన్నారు. తిరుపతిలో జరిగింది తెలుగుదేశం పార్టీ మహానాడుకాదని,తెలుగుదేశం పార్టీ ప్రజలను మహాదగాచేసిన నాడని ఎద్దేవాచేశారు. ఇక రాజధాని నిర్మాణం, నీటి ప్రాజెక్టులపై సక్రమంగా చర్చకూడా చేయలేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలూ లేవు, నిరుద్యోగ భృతిని అందించలేదన్నారు. రాయలసీమలో పేదలు ఆకలితో అలమటిస్తూ ఉంటే మహానాడులో బాబు కడుపారా రుచికరమైన భోజనాలు తిని కడుపునింపుకున్నారన్నారు. 10వేల మంది జనానికి 3500 వేల మంది పోలీసులను వినియోగించుకున్న ఘనత బాబుదే అన్నారు. శ్రీదేవి మాట్లాడుతూ ప్రజాధనాన్ని పరిరక్షిస్తున్నానని వేదికలెక్కిచెప్పేబాబు మహానాడులో 3రోజుల్లో లక్ష యూనిట్లకు పైగా విద్యుత్‌ను వినియోగించుకున్నారన్నారు. వాడుకున్న ఈ విద్యుత్‌కు ఏ విధంగా డిస్కంవారు డబ్బులు వసూలుచేశారో శే్వతపత్రం విడుదలచేయాలన్నారు. అలాగే తిరుపతిలో మహానాడు సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలకు నగర పాలక సంస్థ ఏ విధంగా ఫీజలు వసూలుచేసిందో వాటిపై శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మహానాడు జరిగిన ప్రాంతంలో ఉన్న ప్రసూతి ఆసుపత్రి, రుయా ఆసుపత్రిలో 3రోజుల పాటు ఇన్ పేషెంట్స్ ఎంత మంది, ఔట్ పేషెంట్స్ ఎంతమందో డాక్టరు ప్రకటించారన్నారు. ఇక మహనాడు సందర్భంగా డి ఐ జి దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు పోలీసులు కార్యకర్తలా పనిచేశారే తప్ప ప్రజల అవసరాలను, సౌకర్యాలను విస్మరించాలని విమర్శించారు. ఇక టిటిడి కూడా యథేచ్ఛగా భక్తుల సొమ్మును దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నయనార్ శ్రీనివాసులు, రాజగోపాల్,ప్రమీలమ్మ, నగర మహిళా సంఘం అధ్యక్షురాలు సావిత్రియాదవ్, సుబ్బలక్ష్మి, నరేష్, పరమేశ్వర్ రెడ్డి, దామినేడు రాజా, మాజీ కౌన్సిలర్లు చుక్కలదాము, నరసింహులు, బి ఎంసి భాస్కర్, నన్నిఖాన్, నారాయణ, కిరణ్‌రెడ్డి, చేనేతరైతులు, డ్వాక్రా మహిళలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
భారతరత్న సచిన్ టెండూల్కర్‌కు
విమనాశ్రయంలో ఘన స్వాగతం
రేణిగుంట, మే 31: భారత రత్న సచిన్ టెండూల్కర్‌కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మంగళవారం సాయంత్రం 6.40 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్నారు. ఆయనతోపాటు సినీనటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, సినీ నటుడు నాగార్జున, సినీ నిర్మాత అల్లూ అరవింద్, ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌లు కలిసి వచ్చారు. వీరు రోడ్డు మార్గాన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరి వెళ్లారు.

ఇద్దరిపై పీడీ యాక్టు
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, మే 31: ఎర్రచందనం అక్రమరవాణాలో మరో ఇద్దరిపై చిత్తూరు పోలీసులు పీడియాక్టు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ ఒక ప్రకటలో తెలిపారు. ఢీల్లీకి చెందిన నికాష, కార్నాటకకు చెందిన జమీర్ ఖాన్ లు గత కొంత కాలంగా ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలక పాత్ర వహించనట్లు వివరించారు. వీరిపై చిత్తూరు జిల్లాతోపాటు కర్నాటకలో అనేక కేసులు నమోదు అయినట్లు పేరొన్నారు. శేషాచలం అడవుల నుంచి సేకరించిన ఎర్రచందనం దుంగలను పలు విధాలుగా పొరుగు దేశాలకు ఎగుమతులు చేసేవారిని, అలాగే అలువురు బడా స్మగ్లర్లతో వీరికి మంచి సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. దీంతో వీరిపై పీడీయాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
దివ్యదర్శనం భక్తుల కోసం మరో 6 కంపార్ట్‌మెంట్లు
* టిటిడి ఇ ఓ వెల్లడి
తిరుమల, మే 31: శ్రీవారిని దర్శించుకోవడం కోసం కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో తిరుమలలో అదనంగా వారికోసం 6 కంపార్టుమెంట్లు ఏర్పాటుచే యడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఈ వారంలోపు ఈ కంపార్టుమెంటులు సిద్ధం చేస్తామని టిటిడి ఇ ఓ డాక్టర్ సాంబశివరావు అన్నారు. మంగళవారం స్థానిక అన్నమయ్య భవనంలో టిటిడిలోని వివిధ విభాగాల అధిపతులు, సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలినడకన వచ్చే భక్తలకు దివ్యదర్శన విధానంతో భక్తులకు దర్శనం కల్పిస్తున్నామన్నారు. వీరు వేచి ఉండటం కోసం ప్రస్తుతం 16 కంపార్టుమెంటులు కేటాయించడం జరిగిందన్నారు. మరో 2వేల మంది భక్తులు వేచి ఉండటానికి వీలుగా మరో 6 కంపార్టుమెంటులను ఏర్పాటుచేస్తున్నామన్నారు. శ్రీవారి ఆలయం వద్దగల కదిలే బ్రిడ్జిని భక్తులకు మరింత ఉపయుక్తంగా తీర్చిదిద్దేందుకు ఐఐటి నిపుణులతో అధ్యయనం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు . ఆలయ వాహన మండపం వద్ద బుధవారం నుంచి ప్రహరీ ఉద్యానవనాలను ప్రయోగాత్మక విధానంతో పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించాలన్నారు. రూ.30 లక్షల వ్యయంతో హైదరాబాద్‌కు చెందిన హర్ష బయోఫామ్ సంస్థ ఏడాది పాటు ఈ ప్రహరీ ఉద్యానవనాలను నిర్వహిస్తుందన్నారు. అదే సమయంలో టిటిడి ఉద్యానవన సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. తిరుమలలో వృధా అవుతున్న నీటిని సమర్థవంతంగా వినియోగించేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. వేసవి కాలంలో కంపార్టుమెంటు నుంచి వెలుపలికి వచ్చిన క్యూలైన్లలో చల్లదనం కోసం కృత్రిమంగా పొగమంచును సృష్టించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు. తిరుమలలో ప్రతిరోజూ కీలక ప్రాంతాల్లో 400 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను వినియోగించుకోవాలన్నారు. ఈ సమావేశంలో టిటిడి జె ఇ ఓ శ్రీనివాస రాజు, సి ఇ చంద్రశేఖర్ రెడ్డి, అదనపు ఎఫ్ ఎ అండ్ సి ఎ ఓ బాలాజి, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు.

ఆత్మలకు శాంతి పేరుతో మోసం
* పోలీసులకు నిందితుని అప్పగించిన బాధితులు
తిరుపతి, మే 31: తాను హరేరామ హరేకృష్ణ సంస్థకు చెందిన వ్యక్తినని, చనిపోయిన వారికి పూజలు చేస్తామని, వారి ఆత్మ భగవంతుడిలో లీనం అవుతుందని నమ్మించి డబ్బులు గుంజుతున్న ఓ వ్యక్తిని స్థానికులు మంగళవారం పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తన పేరు రవి అని, వడమాలపేటకు చెందినవాడిగా చెప్తున్న వ్యక్తి చనిపోయిన వారు పేపర్లో ప్రకటన ఇస్తే అందులో ఉన్న వారి ఫోను నెంబరు పట్టుకొని వారికి ఫోన్ చేస్తాడు. దహన సంస్కరాల సమయంలో తాను పూజలు చేస్తానని, అది చనిపోయిన వ్యిక్తి ఆత్మకు మేలు చేస్తుందని ఫోన్ చేస్తాడు. అక్కడకు వెళ్లి ఏవో పూజలుచేసి ఆ తరువాత ఆ ఇంటి కుటుంబ సభ్యుల వద్ద రూ.5వేలు డబ్బులు తీసుకుంటాడు. అంతేకాకుండా ఆ దహన సంస్కరణలకు హాజరైన వ్యిక్తుల వద్దకు వెళ్లి చనిపోయిన వారి కుటుంబం బాధల్లో ఉన్నారని డబ్బులు మీరివ్వాలంటూ వారి వద్దనుంచి కూడా డబ్బులు తీసుకొని వెళ్తాడు. ఈ నేపథ్యంలో డి వి ఆర్ హాస్పిటల్‌కు ఎదురుగా ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో మునీంద్రబాబు అనే వ్యక్తి తండ్రి సోమవారం మరణించాడు. ఈ విషయాన్ని సన్నిహితులకు తెలియజేయడానికి వారు పేపర్‌లో ప్రకటన ఇచ్చారు. ఇస్కాన్‌లో పనిచేస్తున్నట్లు చెప్తున్న రవి అనే వ్యక్తి వారికి ఫోన్ చేసి వెళ్లి పూజలు చేసి డబ్బులు తీసుకున్నాడు. ఆ దహన సంస్కారాలకు వచ్చిన వారిలో ఒకరిద్దరు ఇలాగే మోసపోయిన విషయాన్ని అక్కడ చెప్పుకోవడంతో అందరూ కలిసి అలిపిరి పోలీసులకు అప్పగించాడు. అంతేకాకుండా ఇస్కాన్ నిర్వాహకులు కూడా సమాచారాన్ని అందించారు.
పాత అజెండాపై కౌన్సిల్‌లో రగడ

శ్రీకాళహస్తి, మే 31: గతంలో ఆమోదించిన అజెండాను తిరిగి ప్రవేశపెట్టడంపై వైకాపా సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. మంగళవారం శ్రీ కాళహస్తి మునిసిపల్ సమావేశం వైస్ చైర్మన్ పార్థసారథి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వైకాపా సభ్యులు హరి, బాలకృష్ణయ్య అజెండాలోని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈనెల 25వ తేదీన టిడిపి సభ్యులు సమావేశానికి రాకపోవడం వల్ల తామే వెలిగేట్ చైర్మన్ ద్వారా సమావేశాన్ని జరిపి అజెండాలోని అంశాలను ఆమోదించామన్నారు. కోరం ఉండటం వల్ల చట్టసమ్మతమని , అదే అంశాలను తిరిగి అజెండాలో పెట్టడం చట్టవ్యతిరేకం అన్నారు. అంతేకాకుండా అత్యవసర సమావేశంలోని అంశాలను సాధారణ సమావేశంలో పెట్టకూడదనే నిబంధన ఉందని ,దానిని కూడా ఉల్లంఘించాలని తప్పుపట్టారు. అయితే 25వ తేదీన సమావేశం వాయిదా పడిందని, వాయిదాపడిన అంశాలను అజెండాలో చేర్చవచ్చని కమిషనర్ శ్రీరామశర్మ స్పష్టం చేశారు. గత సమావేశంలో పిలిచిన టెండర్ల వివరాలు సక్రమంగా లేకపోవడం వలన పూర్తి వివరాలతో పొందుపరచామని వైస్ చైర్మన్ తెలిపారు. దీనిపై వైకాపా సభ్యులు కమిషనర్‌తో, వైస్‌చైర్మన్‌తో వాగ్వాదం చేశారు. టెండర్లలోని మొదటి మూడు అంశాలను రద్దుచేస్తున్నట్లు వైస్ చైర్మన్ ప్రకటించారు. దీనిపై వైకాపా సభ్యులు బిజెపి కౌన్సిలర్ లతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మురుగుకాలువలు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, జన్మభూమిలో ఆందోళన చేయడం వల్ల జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారని లత తెలిపారు. అయినా ఆ అంశాన్ని రద్దుచేయడం అన్యాయమని వాదించారు. టిడిపి సభ్యులు అజెండాలోని అన్ని అంశాలకు ఒకేసారి ఆమోదం తెలపడంతో సభ ముగిసినట్లు వైస్ చైర్మన్ ప్రకటించారు. అయితే అజెండాలోని అంశాలను చర్చించకుండా ఆమోదించడంపై వైకాపా సభ్యులు అభ్యంతరం తెలిపారు.
16 నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు

తిరుచానూరు,మే 31: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఈనెల 16నుంచి 20 వతేదీ వరకు 5రోజుల పాటు నెలనెలా నిర్వహించనున్నారు. ప్రతి రోజూ సాయంత్రం అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ వేంకటేశ్వరుని పట్టపురాణి అయిన అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో ఉన్న తిరుచానూరులో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్న విషయం పాఠకులకు విదితమే. ప్రతి యేడాది అమ్మవారికి జ్యేష్ట శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు అమ్మవారికి తెప్పోత్సవాలు నిర్వహించే సాంప్రదాయాన్ని టిటిడి పాటిస్తోంది. ఈ తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి మోక్షం, సుఖం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. పద్మసరస్సులో బంగారు పద్మం నుంచి ఆవిర్భవించిన అలమేలు మంగమ్మ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలధిలో మునిగిపోకుండా రక్షించి సర్వసుఖాలు ప్రసాదిస్తుందని ఈ తెప్పోత్సవ అంతరార్థం. తొలిరోజైన 16వ తేదీ నాడు రుక్మిణీ సత్యభామ స మేత శ్రీ కృష్ణస్వామి, రెండోరోజు సుందరరాజస్వామి, చివరి మూడురోజులు పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. కాగా ఈ చివరి మూడురోజుల పాటు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తెప్పోత్సవాల అనంతరం ప్రతిరోజూ అమ్మవారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శమిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు
తెప్పోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో 5రోజుల పాటు కల్యాణోత్సవం , ఊంజల్‌సేవ లను రద్దుచేశారు. అదేవిధంగా జూన్ 16న తిరుప్పావడ సేవ, 17న లక్ష్మీపూజ, 18న పుష్పాంజలి సేవ, 20న అష్టదళ పాదపద్మారాధన సేవలు కూడా రద్దయ్యాయి.
ఇదిలా ఉండగా తెప్పోత్సవాల సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, సంగీత , సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
మహిళలను మోసం చేసిన మాయలేడి పావని అరెస్టు
* 14 రోజుల రిమాండ్

ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, మే31: చీటీలు ,వడ్డీ వ్యాపారం చేస్తూ మహళలను మోసం చేసిన చిత్తూరు నగరానికి చెందిన పావని ఆమె భర్త చరణ్ లను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. వీరిని మంగళవారం చిత్తూరు కోర్టులో హాజరు పరచగా నాల్గవ అదనపుజడ్జి యుగంధర్ వీరికి 14రోజలు పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశించారు. చిత్తూరుకు చెందిన పావని కొనే్నళ్లుగా నగరంలో చీరలు వ్యాపారం చేస్తూ పరిచయాలను పెంచుకొంది. ఈక్రమంలో పలువురి మహిళలను మాయ మాటలతో నమ్మించి బంగారుల నగలను తీసుకొస్తే అధికివడ్డీ ఇస్తానని నమ్మించింది. దీంతో పలువురు మహిళలు భారీ మోత్తంలో బంగారు నగలను తీసుకొచ్చి అమెకు ఇవ్వడం జరిగింది. ఆ నగలను పావని నగరంలోని ఓప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో తాకట్టుపెట్టి జల్సాలు చేసింది. దీంతో కొందరు బాధితులు పావని మోసాలను గుర్తించి నిలదీసారు. ఈ క్రమంలో చిత్తూరు మేయర్ దంపతుల హత్యకేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న చింటూను అప్పట్లో పావని ఆశ్రయించి బెదిరింపుచర్యలకు పాల్పడింది. దీనికి చింటూ అన్ని విధాలుగా సహకరించడంతో మోసపోయిన బాధితులు బయంతో ఎవ్వరికి చెప్పుకోలేక ఉండి పోయారు. ఈతరుణంలో మేయర్ దంపతులు హత్యకు గురికావడం చింటూను పోలీసులు అరెస్టు చేయడం జరిగిపోయింది. అనంతరం పావని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అప్పటికే పావని ఆమెభర్త చరణ్‌లు పారిపోయారు. వీరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఆమె నగలను తాకట్టు పెట్టిన ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో విచారణ చేయగా సుమారు 8 కిలోల బంగారు నగలు ఆమె పేరుతో ఉన్నట్లు గుర్తించారు. గత ఏడాది డిసెంబరు నెల నుంచి వీరి కోసం పోలీసులు గాలిస్తుండగా తమళనాడు రాష్ట్రం సేలంలో ఉన్నట్లు గుర్తించి సోమవారం అర్ధరాత్రి వీరిని అరెస్టుచేసి చిత్తూరు కోర్టులో హాజరు పరిచారు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న వీరిని తిరిగి విచారణ కోసం పోలీసులు తమ కష్టడికి తీసుకొనున్నారు.
కల్పవృక్ష వాహనంపై ఊరేగిన వేణుగోపాల స్వామి

కార్వేటినగరం,మే 31: కార్వేటినగరంలో వెలసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు స్వామివారు కల్పవృక్ష వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి శుద్ధి,తోమాల సేవ, కొలువు, పంచాంగా శ్రవణం, అర్చన, మొదటి గంట తదితర నిత్యకైంకర్యాలను నిర్వహించారు. అనంతరం భక్తలకు సర్వదర్శనం ఏర్పాటుచేశారు. స్వామివారిని కల్పవృక్ష వాహనంపై అధిష్టింపచేసి మాడవీధుల్లో, గ్రామపురవీధుల్లో కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ దర్శన భాగ్యం కల్పించారు. హనుమజ్జయంతిని పురస్కరించుకొని స్వామివారి ఉత్సవర్లకు తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం కల్యాణోత్సం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణోత్సవంలో అధిక సంఖ్యలో దంపతులు పాల్గొని కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై దేవేరుల సమేతుడైన స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు నారికేళ కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి ఊరేగింపులో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, చెక్క భజనలు, కోలాటాలు, పండరి భజన తదితర కార్యక్రమాలతో ఆద్యంతం శోభాయమానంగా స్వామివారి వాహనసేవ కొనసాగింది. అనంతరం స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ పరిసరాలు చలువపందిళ్లు, విద్యుత్ దీపాలు, రంగవల్లులు అత్యంత రమణీయంగా అలంకరించారు. స్వామివారి ఊరేగింపులో చిన్నారుల నృత్య ప్రదర్శనలు, చిన్ని కృష్ణుడి వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి కరుణాకర్, అర్చకులు , టిటిడి సిబ్బంది, షరాబు రమేష్, గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

39 ఎర్రచందనం దుంగలు పట్టివేత
* 15 మంది కూలీలు అరెస్ట్
చంద్రగిరి,మే 31: చంద్రగిరి సమీపంలోని అడవుల్లో మరోమారు ఎర్రచందనం కూలీలు పట్టుబడ్డారు. చీకటీగల కోనలో ఉడుమల గోడ వద్ద 21 దుంగలు, సచ్చినోడిబండ సమీపంలో 18 దుంగలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం టాస్క్ఫోర్స్ పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా శేషాచలం అడవుల్లల్లోని సచ్చినోడిబండ సమీపంలో కూంబింగ్ చేస్తున్న సమయంలో ఎర్రకూలీలు తారసపడ్డారు. పోలీసులను గమనించిన కూలీలు దుంగలను పడేసి పారి పోయారు. పోలీసులు వారి వెంటపడి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. 18 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే పట్టుబడ్డవారిలో ఆరుగురు చంద్రగిరి మండలం రంగంపేటకు చెందిన వారుగా పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం.
ఉడుమల గోడ వద్ద...
చంద్రగిరి మండలం సమీపంలోగల అటవీ ఫారెస్ట్ రేంజ్‌లో చీకటీగల కోనలో ఫారెస్ట్ అధికారులకు ఎర్రచందనం కూలీలు ఎదురుపడటంతో పోలీసులు అటవీశాఖ అధికారులను చూసి ఎర్రదొంగలు పారిపోయారు. దీంతో వారు అక్కడ అటవీశాఖాధికారులు వెంటపడి ఏడుగురిని అదుపులోకి తీసుకోగా 21 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖాధికారులు తెలిపారు. వీరు సురేష్,సుబ్రహ్మణ్యం, రామస్వామి, పెరుమాళ్, కృష్ణ, చిన్నస్వామి, వినాయకలు వీరందరూ వేలూరు శాలంకు చెందిన వాళ్లు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ విజయ్‌కుమార్, ఎఫ్ బి ఓ హరి, ఎబి ఓ చిన్ని పాల్గొన్నారు.