చిత్తూరు

సిఎం నవనిర్మాణ దీక్షలో భాగస్వాములవుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 2: రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్‌ను అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి నవ నిర్మాణ దీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలో భాగస్వాములై రాష్ట్ర ప్రగతికి తోడ్పడదామంటూ ప్రజలు, అధికారులు చేసిన ప్రతిజ్ఞలతో తిరుపతి పుణ్యక్షేత్రం మారుమోగింది. గురువారం నుండి ఈనెల 7వ తేదీ వరకు నవనిర్మాణ దీక్షలు చేపట్టాలని, 8న మహాసంకల్పం చేపట్టాలని రాష్ట్ర ప్రజలకు, అధికారులకు ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపునేపథ్యంలో గురువారం తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద నవనిర్మాణ దీక్షను చేపట్టారు. విజయవాడలో ముఖ్యమంత్రి చేపట్టిన నవనిర్మాణ దీక్షను టివిలో వస్తున్న ప్రతక్ష్యప్రసారాన్ని వీక్షిస్తూ అందరూ దీక్షలు పూనారు. సి ఎం చేపిన ప్రతిజ్ఞ చేశారు. అనంతరం సిఎం ప్రసంగాన్ని పూర్తిగా విన్నారు. అలాగే ఎస్వీ యూనివర్శిటీ సెనెట్‌హాల్లో విసి దామోదరం, ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జయలక్ష్మి, తిరుపతి టౌన్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ పులుగోరుమురళీకృష్ణారెడ్డి , తిరుపతి సబ్ కలెక్టర్ హిమాంశు శుక్లా, డిస్కంలో సిఎం డి హెచ్.వై. దొరల ఆధ్వర్యంలో సిబ్బంది, ఉద్యోగులు, ప్రజలు ఎక్కడికక్కడ దీక్షలు పూనారు. కాగా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, కమీషనర్ వినయ్‌చంద్‌లు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపేందుకు ప్రజలను బాగస్వాములను చేయడానికి సి ఎం చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్షతో ఈకార్యక్రమాన్ని నిర్వహించడం ఇందుకుప్రజల నుంచి విశేష స్పందన లభించడం అభినందనీయమన్నారు. ఈనెల 7వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, 8న సి ఎం నిర్వహించే మహాసంకల్ప దీక్షలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు బాగస్వాములు కావాలని కోరారు. ఈకార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.