చిత్తూరు

సిఎంపై నేడు అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 7: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసినందుకుగాను ఆయనపై జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌లలో 420 కేసు పెడతామని వైఎస్‌ఆర్‌సిపి జిల్లా అధికార ప్రతినిధి తిరుత్తణి వేణుగోపాల్ చెప్పారు. మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్నా ఇంత వరకూ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. దీనిని ప్రశ్నిస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. రైతు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని అన్నారు. తెలంగాణలో ఓటుకు నోటు వ్యవహారంలో చిక్కుకుపోయిన చంద్రబాబునాయుడు కెసిఆర్ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మాణాలు చేపడుతున్నా నోరు మెదపడం లేదన్నారు. దీంతో రాయలసీమే కాకుండా రాష్ట్రం తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ప్రజలను మోసంచేస్తున్న బాబుపై పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదుచేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలుకూడా పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.