చిత్తూరు

తమిళనాడుకు చెందిన దొంగ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 24 : తిరుపతిలోని పలు ప్రాంతాల్లో 22 మోటార్‌బైక్‌లను చోరీ చేసిన తమిళనాడు రాష్ట్రం వేలూరులోని చిన్నల్లాపురం, కెకె నగర్‌కు చెందిన శశికుమార్ అలియాస్ శశి (38)ని తిరుపతి క్రైం పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి క్రైం పోలీస్‌స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న మోటార్‌బైక్‌ల దొంగతనాలపై ప్రత్యేక టీం ఏర్పాటు చేశామని వివరించారు. గురువారం స్థానిక రామానుజ సర్కిల్ బస్‌స్టాప్ వద్ద శశికుమార్‌ను అనుమానించి విచారించగా కేవలం నెల రోజుల్లో నగరంలోని పలు చోట్ల 22 మోటారుబైక్‌లు చోరీ చేసినట్లు వెల్లడించాడన్నారు. చోరీ చేసిన వాటిలో స్థానిక విష్ణునివాసం వద్ద ఉంచిన 9 మోటారుబైక్‌లు, వేలూరులోని భాస్కర్ అనే వ్యక్తి వద్ద ఉన్న రెండు మోటార్‌బైక్‌లు, తంగరాజు అనే వ్యక్తి వద్ద ఉన్న నాలుగు మోటార్‌బైక్‌లు, నిందితుని ఇంటి వద్ద ఉన్న ఆరు మోటార్‌బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు 14 లక్షలని తెలిపారు. మద్యానికి బానిసగా మారి డ్రైవర్ వృత్తిని మానుకుని తిరుపతిలో వాహనాలను చోరీ చేస్తున్నాడని ఎస్పీ వివరించారు. వాహనదారులు తమ వాహనాన్ని పార్కు చేసిన ప్రతి చోట ముందు చక్రానికి వీల్‌లాక్ వేసుకోవాలని తెలిపారు. మెకానిక్‌లు కూడా తమ వద్దకు రిపేరు కోసం వచ్చే మోటార్‌బైక్‌లకు వీల్‌లాక్‌లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మోటార్‌బైక్ కంపెనీవారు కూడా వాహనాలను డెలివరీ చేసే ముందు వీల్‌లాక్ విధిగా బిగించి ఇవ్వాలని స్పష్టం చేశారు. కాగా నిందితుడిని డిఎస్పీ కొండారెడ్డి ఆధ్వర్యంలో సిఐ సత్యనారాయణ అరెస్టు చేశారని అన్నారు. మోటార్‌బైక్‌లను రికవరీ చేయడంలో సిసిఎస్ ఇన్‌స్పెక్టర్లు కె శరత్‌చంద్ర, వి భాస్కర్, ఎ పద్మలత, ఎస్‌ఐలు, సిబ్బంది విశేష కృషి చేశారని, వీరిని అభినందిస్తూ రివార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.