చిత్తూరు

త్వరలో 300 డాక్టర్ పోస్టులు భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూలై 8: రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్ జయచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం చిత్తూరులో ఆయన విలేఖర్లతోమాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం కూడా ఏటా బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని వివరించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా వైద్య విధాన పరిషత్ పరిధిలోని అన్ని ఆసుపత్రులలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా త్వరలోనే 300డాక్టరు పోస్టుల భర్తీకి నోటిపికేషన్ జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆసుపత్రిలో రోజువారి ఓపిల సంఖ్య ఆధారంగా ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికి వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 120 ఆసుపత్రులను 50పడకల నుంచి వంద పడకలకు మార్చామన్నారు. పలు ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అధునాతన పరికరాలను అందించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. అన్ని ఆసుపత్రులలో ఆల్ట్రా స్కానింగ్ మిషన్లను మంజూరు చేయనున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టామని దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసుపత్రులకు రోజువారి రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. గైనకాలజిస్ట్, అనస్టీషియా సంబంధించి డాక్టర్లు అన్ని ఆసుపత్రుల్లో ఉండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహకారంతో ఈ ప్రభుత్వ ఆసుపత్రులకు వౌలిక వసతులతో పాటు సిబ్బంది కొరత, మందులు సకాలంలో అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వం కూడా ఈ ఆసుపత్రుల అభివృద్ధికి సానుకూలంగా స్పందిస్తున్నట్లు ఆయన తెలిపారు.