చిత్తూరు

‘జ్యోతిరావ్ పూలే బాట అందరికీ ఆదర్శం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 28: మహాత్మ జ్యోతిరావ్ పూలే మహా సంఘ సంస్కర్తని, ఆయన బాట అందరికీ ఆదర్శమని తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, తిరుపతి మాజీ ఎంపి చింతామోహన్, వైకాపా తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, బిసి సంఘర్షణసమితి జిల్లా అధ్యక్షుడు అన్నారామచంద్రయ్య తదితరులు పేర్కొన్నారు. శనివారం జ్యోతిరావ్ పూలే 125వ జయంతిని పురస్కరించుకుని పలు రాజకీయ పార్టీల నేతలు, కుల సంఘాల నేతలు స్థానిక బాలాజీ కాలనీలోని పూలే విగ్రహానికి పూల మాలలువేసి నివాళులు అర్పించారు. పూలే ఆశయాలను సాధిస్తామంటూ నినాదాలు చేశారు. ఈసందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో ఆపార్టీ నేతలు డాక్టర్ సుధారాణి, డాక్టర్ ఆశాలత, డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, డాక్టర్ శ్రీహరి, బుల్లెట్ రమణ, దంపూరి బాస్కర్, మునిశేఖర్ తదిరులు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పిసిసి సంయుక్త కార్యదర్శి రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ఏ ఐ సిసి సంయుక్త కార్యదర్శి తిరునావక్కరుసు, ఎమ్మెల్సీ పి.రామచంద్రయ్య, తులసిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా, అశోక్‌సామ్రాట్ యాదవ్, మబ్బు దేవనారాయణ, నగర కార్యదర్శి నాగభూషణం, జిల్లా కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పూలే విగ్రహానికి అంజలి ఘటించారు. అనంతరం ఆయన శ్రీకాళహస్తి,సత్యవేడు నియోజక వర్గాల్లో వరద బాధితులను పరామర్శించడానికి తరలివెళ్లారు. కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకుడు, తిరుపతి మాజీ ఎంపి చింతామోహన్ సైతం పూలే విగ్రహానికి పూల మాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. వైకాపా రాష్ట్రప్రధాన కార్యదర్శి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆపార్టీ నాయకులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, ఎస్ కె బాబు తదితరులు సైతం పూలే విగ్రహానికి నివాళులు అర్పించారు.
పూలే జీవితం నేటి యువతరానికి ఆదర్శమని చెప్పారు. మహిళల చదువు దేశానికి వెలుగని, మహిళలను సైతం సమాజంలో సమానంగా చూడాలని నినదించిన నేత పూలే అని కొనియాడారు. పూలే విగ్రహానికి పూల మాలలువేసి నివాళులు అర్పించిన బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నా రామచంద్రయ్య మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న అణచివేతను, దాడులను ఎదుర్కొవాలంటే చదువుఒక్కటే మార్గమని చెప్పి, అందరికి చదువు నేర్పించడానికి కృషి చేసిననేత పూలే అన్నారు. జై సమైక్యాంద్రపార్టీ నాయకుడు నవీన్‌కుమార్ రెడ్డి, శ్రీబాలాజీ వడ్డెర సంక్షేమ అధ్యక్షులు మల్లికుప్పం శేఖర్, ప్రధాన కార్యదర్శి చంద్రయ్య, సంయుక్త కార్యదర్శులు పెరుమాల్, వెంకటస్వామి, అలాగే రమణ, శ్రీనివాసరావు, రమేష్. వెంకటసుబ్బయ్య,చలపతి, మధన్‌మోహన్, బాలాజీ, వెంకటయ్య తదితరులు కూడా పూలే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.