చిత్తూరు

రైల్వే జిఆర్‌పి ఎస్‌ఐను సస్పెండ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 17: రైల్వే స్టేషన్‌లో పనిచేస్తున్న చిరువ్యాపారులను వేధింపులకు గురిచేస్తున్న రైల్వే జి ఆర్ పి ఎస్ ఐ ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్ చేయాలని ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు టి. మురళి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక తిరుపతి రైల్వేస్టేషన్‌లోని పోలీస్ స్టేషన్ వద్ద ఎ ఐ టి యుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ రైల్వేస్టేషన్‌లో పనిచేస్తున్న వెండర్స్‌పై దాడులు నిర్వహిస్తున్నారని, పోలీస్ స్టేషన్‌లో బాత్ రూం లు శుభ్రం చేయడానికి వెండర్స్‌ను వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. గత మంగళవారం ఓ ప్రయాణీకుడు తన సెల్‌ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇస్తే అక్కడ టి. అమ్ముకునే రియాజ్ బాషాను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారన్నారు. అంతటితో ఆగక 4రోజులు పోలీస్ స్టేషన్‌లో పెట్టి వేధింపులకు గురిచేశారన్నారు.శనివారం 14వేల రూపాయలను లంచం తీసుకొని ఒక పెట్టీ కేసు పెట్టి 200 రూపాయలు తీసుకొని వదిలేశారన్నారు. రైల్వే స్టేషన్‌లో దొంగతనాలకు పాల్పడింది ఎవరని ఎస్ ఐ కుతెలిసినా ఆయన వారిని పట్టుకోరని, కష్టపడి పనిచేసుకునే వెండర్లను వేధిస్తారన్నారు. ప్రవీణ్ లంచాలకు అలవాటుపడి దోచుకుతింటున్నాడని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రైల్వే సి ఐ సుబ్రహ్మణ్యం చొరవ తీసుకొని ఆందోళన కారులతో చర్చించి విచారించి తగు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎ ఐ టి యు సి నాయకులు రాధాకృష్ణ, శ్రీరాములు, ఎన్ డి రవి, ఎ ఐ వై ఎఫ్ నగర అధ్యక్ష, కార్యదరుర్శలు సతీష్ కుమార్, శివకుమార్, ఎ ఐ టి యు సి నాయకులు కె. వై రాజ, జగన్నాధం, రామకృష్ణ, నాగభూషణం పాల్గొన్నారు.