చిత్తూరు

ఒకే గొడుగు కిందకి టిటిడిలోని ఐటి అప్లికేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 18: భక్తుల సౌకర్యార్థం టిటిడిలోని ఆయా విభాగాలు నిర్వహిస్తున్న ఐటి అప్లికేషన్లు అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి టిసిఎస్ సంస్థ ఆధ్వర్యంలో మరింత మెరుగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు సంబంధిత అధికారులకు సూచించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో సోమవారం సీనియర్ అధికారులతో ఇఓ వారపు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా ఇఓ మాట్లాడుతూ ధర్మప్రచారంలో భాగంగా సప్తగిరి మాసపత్రికను రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాలకు ఉచితంగా పంపిణీ చేయాలని, తద్వారా ఎక్కువ మంది పాఠకులకు చేరుతుందని తెలిపారు. టిటిడి విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న సీట్లకు సంబంధించి అడ్మిషన్లను సకాలంలో పూర్తి చేయాలన్నారు. టిటిడికి అవసరమైన చింతపండు, బెల్లం సరఫరాకు సంబంధించి సరఫరాదారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ అధికారులకు సూచించారు. చింతపండు, బెల్లం ఉత్పత్తి ఎక్కువశాతం చిత్తూరు, అనంపురం జిల్లాల్లో ఉందని, ఈ సరకులను ఎప్పటికప్పుడు నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మార్కెటింగ్ అవసరాల కోసం గోడౌన్లు, కోల్డ్‌స్టోరేజి ప్లాంట్ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న ప్రథమ చికిత్స కేంద్రంలో క్రమం తప్పకుండా డాక్టర్, పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఇఓ కోరారు. తిరుమలలోని ప్రైవేటు హోటళ్లలో ఎక్కువ లైటింగ్‌తో కూడిన పెద్దపెద్ద సైన్‌బోర్డులను తొలగించాలని ఆదేశించారు. టిటిడి స్థానిక ఆలయాలు, విశ్రాంతి గృహాల్లో శుభ్రం చేసేందుకు యంత్రాలను కొనుగోలు చేయాలన్నారు. తిరుపతిలోని అవిలాల చెరువులో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని డిఎఫ్‌ఓకు సూచించారు. మండల స్థాయిలోని కల్యాణ మండపాల ఆధునీకరణ పనులను త్వరిగా పూర్తి చేయాలన్నారు. టిటిడి కళాశాలలు, హాస్టళ్లలో కొళాయిల మరమ్మతులు చేపట్టి లీకేజిని అరికట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో టిటిడి తిరుపతి జెఇఓ పోలా భాస్కర్, న్యాయాధికారి వెంకటరమణ, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఎ, సిఎవో బాలాజి, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.