చిత్తూరు

ముగ్గురు దొంగల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 22: తిరుపతి-తిరుచానూరులో 7 ఇళ్లు, మహిళల మెడల్లో చెన్లుచోరీచేసి తప్పించుకుతిరుగుతున్న ముగ్గురు దొంగలను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు క్రైం ఎ ఎస్పీ సిద్దారెడ్డి తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.5లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, ట్యాబ్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని అరెస్ట్‌చేశామన్నారు. ఎ ఎస్పీ సిద్దారెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి సాయినగర్‌కు చెందిన బి.లోకేష్ (20), పునీత్‌రెడ్డి(21), ఎస్.్ఛంద్‌భాషా (29) అనే ముగ్గురు దొంగలు పలుచోరీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్నారన్నారు. ఈ క్రమంలో శుక్రవారం లోకేష్, పునీత్‌రెడ్డిని తిరుపతి రామానుజ సర్కిల్ వద్ద అరెస్ట్‌చేశామన్నారు. వీరు తిరుపతి, తిరుచానూరు ప్రాంతాల్లో 7 ఇళ్లల్లో చోరీచేసి 76 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 సెల్‌ఫోన్లు, ట్యాబ్‌ను చోరీచేసినట్లు అంగీకరించారన్నారు. వీరి నుంచి బంగారు ఆభరణాలు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారన్నారు. అలాగే వెంకటగిరికి చెందిన చాంద్‌భాష ప్రస్తుతం తిరుపతి చిన్నకాపువీధిలో నివాసం ఉంటూ చోరీలకు పాల్పడేవారన్నారు. తిరుపతి ప్రాంతాల్లో 3 చోట్ల మహిళల మెడల్లో బంగారు చైను దొంగలించాడన్నారు. గాంధీ రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద చాంద్‌భాషాను అరెస్ట్‌చేసి అతని వద్ద నుంచి 60 గ్రాములు బరువుకలిగిన 3 బంగారు చైన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేశారన్నారు. ఈ ముగ్గురు దొంగలను రిమాండ్‌కు పంపడం జరిగిందన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు డి ఎస్పీ కొండారెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి క్రైం సి ఐ కె.శరత్‌చంద్ర, భాస్కర్‌లతో పాటు సత్యనారాయణ, పద్మలత, ఎస్ ఐ లు ప్రభాకర్ రెడ్డి, చంద్రశేఖర్ పిళ్లై, ఆశీర్వాదం, రామ్మూర్తి, సుధాకర్ సిబ్బంది మునిరాజా, రాజశేఖర్, సుధాకర్, మురళి, వరక్ముని రెడ్డి, కామేశ్వరరావు, శివకుమార్, మురళీకృష్ణ, శేఖర్, శ్రీనివాసులు, రామయ్యలు నేరస్తులను పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనబరిచారన్నారు. వీరికి రివార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. తాము ప్రజలకు విన్నవించేది ఏమిటంటే ఎవరైనా పనిమీద ఊరికి వెళ్లాల్సి వచ్చేటపుడు ఇంట్లో విలువైన వస్తువులను ఉంచవద్దని, ఈవిషయాన్ని పోలీసు శాఖ ప్రజలను ఎప్పటికప్పుడు ప్రజలను హెచ్చరిస్తూనే ఉందన్నారు. అయితే ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దొంగతనాలకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా ప్రజలు పోలీసులు ఇచ్చిన సూచనలను అనుసరించి నేరాలను అరికట్టడంలో సహకరించాలన్నారు. మహిళలు ఒంటరిగావెళ్లే సమయాల్లో కూడా విలువైన ఆభరణాలువేసుకోకూడదని ఆయన హితవు పలికారు.