చిత్తూరు

29న తిరుమలలో ‘వనం-మనం’ కార్యక్రమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూలై 26: కలియుగ వైకుంఠం తిరుమలలో ఈనెల 29వ తేదీ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపటనున్న ‘‘వనం-మనం’’ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం సీనియర్ అధికారులతో ఇ ఓ వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇ ఓ మాట్లాడుతూ తిరుమలలో భక్తులు, టిటిడి సిబ్బంది, శ్రీవారి సేవకులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
భక్తులసేవలో నిరంతరం కాల్ సెంటర్
భక్తులు సలహాలు, సూచనలు, ఫిర్యాదులు కోసం కింది నెంబర్లను సంప్రదించాలని ఇ ఓ కోరారు.
ల్యాండ్‌లైన్ నంబర్లు - 0877-2233333, 22777777
టోల్ ఫ్రీ - 18004254141, 1800425333333
వాట్స్‌యాప్ నెంబరు - 9399399399
ఈ మెయిల్ - హెల్ప్‌డెస్క్‌అట్‌దిరేట్‌ఆఫ్‌తిరుమల.ఓఆర్‌జి
భూలోక నందనవనంగా తిరుమల
శ్రీవారి బ్రహ్మోత్సవాల నాటికి భూలోక నందనవనంగా తిరుమలను రూపొందించాలని ఇ ఓ అధికారులను కోరారు. తిరుమల సుందరీకరణలో భాగంగా శ్రీవారి ఆలయం ముందు భాగంలో ప్రహరి ఉద్యానవనాల తరహాలో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలోనూ, భక్తలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు తిరుపతిలోని శే్వతాలో టిటిడి ఉద్యోగులకు పరాకామణి, విడిది, దర్శనం, అడ్డూ, కల్యాణ కట్ట, శ్రీవారి సేవ తదితర అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. శిక్షణకు సంబంధించి మాడ్యుల్స్ తయారుచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రూ.300 శీఘ్ర దర్శనం టిక్కెట్లతో దర్శనం చేసుకున్న భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ రిపోర్టు సేకరించాలని అధాకారులను కోరారు. దర్శన సౌకర్యాలపై భక్తుల అభిప్రాయం తెలుపవలసిందిగా ఎస్ ఎం ఎస్ పంపాలని టిడిపి అధకారులను ఆదేశించారు. తిరుమలలో వసతిగృహాలు, చౌల్ట్రీల్లో తాగునీరు, స్నానానికి వేడినీరు అందుబాటులో ఉంచడంతో పాటు కొళాయిలు, వాష్‌బేషిన్‌లు, విద్యుద్దీపాలు, తదితరాల మరమ్మతులను పూర్తిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాకాలం రానుండడంతో డ్రైనేజ్ మరమ్మతులు, దోమల నివారణకు మందుస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కల్యాణకట్టలో భక్తులకు మరింత ఉపయోగకరంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. రూ.300 తరహాలో దివ్యదర్శనం కాంప్లెక్స్‌ను త్వరగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
వన్యప్రాణులు జనావాసంలోకి రాకుండా చర్యలు
తిరుమలలో జనావాసాలలోకి ఇటీవల కాలంలో తరచూ చిరుత పులులు వస్తున్న తరుణంలో వసతిగృహాలు వెనుక టిటిడి అటవీశాఖ, ఇంజనీరింగ్ అధకారులు సమన్వయంతో పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. భక్తులు తిరుమలలోని హోటల్స్ వారు తినుబండారాల వ్యర్థాలను లోయలో వేయడం వల్ల, వాటిని తినడానికి వన్యప్రాణులు వస్తున్నాయని, వీటిని వేటాడేందుకు చిరుతపులులు వస్తున్నట్లు తెలిపారు. భక్తులకు, తిరుమలలోని హోటల్స్ నిర్వాహకులకు అవగాహన కల్పించాలని ఆయన ఆరోగ్యశాఖ, విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, అదనపు ఎఫ్‌ఏ అండ్ సిఎఓ బాలాజి, ఎస్ ఇ-2 శ్రీరామచంద్రారెడ్డి, ముఖ్య భద్రతాధకారి రవీంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఇ ఓ కోదండరామారావు, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శర్మిష్ట ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.