చిత్తూరు

జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూలై 29: రుతుపవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసాయి. పలుచోట్ల వాగులు వంకలు పొంగి ప్రవహించగా సోమల, చౌడేపల్లి మండలాల్లో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. దీంతో ఈ మండలాల్లో పంటలకు కొంతమేర నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల్లో జోరుగా ఈదురు గాలులు ఉరుములు మెరుపులతోకూడిన వర్షం కురవడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి దీంతో అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రోడ్లు మార్గాల్లో అడ్డంగా చెట్లు విరిగి పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గింది. పూతల పట్టు మండలంలో గొడుగుచింత గ్రామంలో పిడుగుపడి ఇళ్లలోని ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. చిత్తూరు డివిజన్ లో గురువారం రాత్రి అనేక మండలాల్లో భారీ వర్షం కురువడంతో కల్వకుంట జలాశయంలోనికి సుమారు 20 అడుగుల నీరు చేరింది. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఈ ప్రాజెక్టును పరిశీలించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే చౌడేపల్లి, సోమల మండల అధికారులు ముందస్తు జాగ్రత్తు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో గురువారం రాత్రి సరాసరి 54.5 మి,మీ వర్షం కురిసింది. అత్యధికంగా రామచంద్రాపురంలో 162.2 మి,మీ వర్షం పడింది.తంబళ్లపల్లి 80.8, బి క్తొకోట 32.2, కురబలకోట 64.2, పీలేరు 43.4, వాల్మీకీ పురం 72.4, గుర్రం కొండ 33.4, కలికిరిలో 34.2, మదనపల్లి 66.2, నిమ్మన పల్లి 75.4, రామసముద్రం 56, పుంగనూరు 42, పులిచెర్ల 52.6, రొంపి చెర్ల 43.6, చౌడేపల్లి 80.2, సోమల 75.2, చంద్రగిరి 127, పాకాల 75.4, చిన్నగొట్టిగళ్లు 49.2, ఎర్రావారి పాళ్యం 40.4, రేణిగుంట 140.3, ఏర్పేడు 39.4, కెవిబి పురం 40.2, పుత్తూరు 31.6, వడమాలపేట 103.2, నిండ్ర 32.6, పెనుమూరు 110, కార్వేటి నగర్ 76.2, వెదురకుప్పం 42, పూతలపట్టు 134, తవణం పల్లి 101.4, ఐరాల 115.4, పలమనేరు 110.6, గంగవరం 149.8, వి కోట 104.6, రామకుప్పంలో 62మి,మీ వర్షం కురిసింది.